టాలీవుడ్ పవర్ స్టార్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది.రాజకీయాల ఫలితాల అనంతరం సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వచ్చింది.
అయితే ఆ రూమర్స్ కి పవర్ స్టార్ స్ట్రాంగ్ క్లారిటీ ఇచ్చారు.

తాను రాజకీయాల్లోనే ఉంటాను అని రిజల్ట్ అనంతరం మరింత బలంగా చెప్పడంతో దాదాపు అభ్గిమానులంతా పవన్ నిర్ణయానికి నీరాశచెందారు.అయితే ఇప్పుడు మాత్రం పవన్ న్యూ లుక్ చూశాక ఫ్యాన్స్ ఎమోషన్స్ ఆపుకోలేకపోతున్నారు.ఆయన మళ్ళీ సినిమాల్లోకి రావాలంటూ ఫొటోస్ ఎడిట్ చేస్తూ సినిమా పోస్టర్స్ మాధిరిగా రచ్చ చేస్తున్నారు.
తానా సభల కోసం ముఖ్య అతిధిగా అమెరికా వెళ్లిన పవన్ ఎయిర్ పోర్ట్ లో సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టుకున్నాడు.

జీన్స్ అండ్ టీ షర్ట్ లో అభిమానుల్లో ఒక ఫీల్ ను కలిగిస్తున్నాడు.ఈ లుక్ తో కొంతమంది సంతృప్తిచెందుతున్నప్పటికీ మరికొందరు సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.అయితే పవన్ మాత్రం నటనకు ఇప్పట్లో వెల్కమ్ చెప్పేలా లేడు.
కానీ సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పై వేరే హీరోలతో నిమాలను నిర్మించాలని అనుకుంటున్నాడు.
.






