పవన్ కళ్యాణ్ చివరి చిత్రం అదేనట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న విషయం తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి కేవలం 30 రోజలు షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో, ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇక ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమా తరువాత పవన్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు.

ఇప్పటికే క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాలను లైన్‌లో పెట్టిన పవన్, తనకు బాగా కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ కూడా గతంలోనే విన్న పవన్, 2024 ఎన్నికలకు సిద్ధమయ్యే లోపు ఈ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

పవన్ గతంలో కోబలి అనే టైటిల్‌తో ఓ సినిమాను తెరకెక్కించాలని చూశాడు.కానీ, ఇప్పటివరకు ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

Advertisement

దీంతో తాను రాజకీయంగా బిజీ అయ్యే లోపు తన చివరి చిత్రంగా ‘కోబలి’ని తెరకెక్కించాలని పవన్ భావిస్తున్నాడు.ఈ క్రమంలోనే త్రివిక్రమ్‌ను ఈ సినిమాకు సంబంధించిన కథను రెడీ చేయాలని పవన్ భావించాడట.

దీంతో త్రివిక్రమ్ కూడా పవన్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరి ఈసారి పవన్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథను రెడీ చేస్తాడా, అది కోబలి అనే టైటిల్‌కు ఎంతవరకు సూట్ అవుతుందనే ఆసక్తి ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో నెలకొంది.

ఇక వీలైనంత త్వరగా పవన్ తన చిత్రాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు