త్వరలో జిల్లాల పర్యటన..పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తెలిసిందే.

దీంతో ఆయనకు ఎలాంటి శాఖ ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీ తరఫున సంచలన ప్రకటన విడుదల చేశారు."ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక నలుచెరగుల నుంచీ అభినందనలు, శుభాకాంక్షలు అందుతూనే ఉన్నాయి.

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు, మేధావులు, నిపుణులు, సినీ రంగంలో ఉన్నవారు, యువత, రైతులు, ఉద్యోగ వర్గాలు, మహిళలు అభినందనలు అందిస్తున్నారు.జనసేన పార్టీ నాయకులు,( Jana Sena Party ) వీర మహిళలు, జన సైనికులు ఆనందంతో వేడుకలు చేసుకున్నారు.

ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

Advertisement

రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నన్ను నేరుగా కలిసి అభినందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారు.త్వరలోనే వారందరినీ జిల్లాలవారీగా కలసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.ఇందుకు సంబంధించిన షెడ్యూలు కేంద్ర కార్యాలయం ద్వారా తెలియచేస్తాము.

అభినందనలు తెలియచేయడానికి వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది.

అదే విధంగా శాసన సభ సమావేశాలు కూడా త్వరలోనే ఉంటాయి.వీటిని పూర్తి చేసుకొని నన్ను అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం నియోజక వర్గ ప్రజలను కలుస్తాను.

ఈ నెల 20వ తేదీ తరవాత పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Constituency )లోని కార్యకర్తలను కలుస్తాను.ఆ తరవాత దశలవారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తాను".

త్రివిక్రమ్ కథ చెప్తుంటే పవన్ కల్యాణ్ నిద్ర పోతే, మహేష్ బాబు లేచి వెల్లిపోయారట
వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 

అని ప్రకటన విడుదల చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు