బలవంతంగా పార్టీలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదంటున్న పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాలలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఎన్నికల ముందు వరకు పర్వాలేదనే విధంగా ఉన్న జనసేన పార్టీ భవిష్యత్తు ఇప్పుడు పార్టీని వీడుతున్న నాయకులతో రాజకీయ వర్గాలలో కాస్తా ఇబ్బందికరంగా మారింది.

స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టి క్రింది స్థాయిలో పార్టీకి బలమైన పునాదులు వేసుకోవాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీలోని నేతలు షాక్ ఇస్తూ వరుసగా పార్టీని వీడి బయటకి వెళ్ళిపోతున్నారు.తాజాగా జనసేనలో కీలక నేత జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేయగా ఉన్న ఒక్క ఎమ్మెల్యే పేరుకే జనసేనలో ఉన్న కూడా అంతా వైసీపీ పాట పాడుతున్నారు.

దీంతో పార్టీ క్యాడర్ కూడా కాస్తా నిస్ప్రుహలోకి వెళ్తుందనే మాట వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నాయకులపై వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అయిన సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో ఉండేవాళ్లు ఉండవచ్చని, ఇష్టం లేని వాళ్లు వెళ్లిపోవచ్చని నిర్మొహమాటంగా చెప్పేశారు.బలవంతంగా పార్టీలో ఎవరూ ఉండాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement

కాపలా కాసే రాజకీయాలు తాను చేయనన్నారు.తనపై ఆధారపడ్డే వారి కోసమే సినిమాలు చేస్తున్నానని చెప్పారు.

నెలకు కోటిరూపాయల ఆదాయం, వేల కోట్ల ఆస్తి ఉంటే తాను సినిమాు చేయనని పవన్ కల్యాణ్ చెప్పారు.అయితే ఈ విమర్శలు తాజాగా రాజీనామా చేసిన జేడీ లక్ష్మినారాయణకి డైరెక్ట్ గా తగిలేలా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.

మరి ఈ వ్యాఖ్యల పట్ల జేడీ ఎలా స్పందిస్తారో చూడాలి.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు