పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలీ, మోహన్ బాబును పట్టించుకోకపోవడానికి కారణమిదేనా?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.పవన్ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 2.4 మిలియన్లుగా ఉంది.పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చినా తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు.

 Pawan Kalyan Instagram Post Goes Viral In Social Media Details, Pawan Kalyan, Pa-TeluguStop.com

తాజాగా పవన్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ ఒక వీడియోను షేర్ చేశారు.

చిరంజీవి, బాలయ్య, వెంకటేశ్, నాగార్జున, అమితాబ్, మహేష్, రామ్ చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, సూపర్ స్టార్ కృష్ణ, అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, రెహమాన్, బొమన్ ఇరానీ, ఖుష్బూ, రాజమౌళి, వేణుమాధవ్, రవితేజ, సాయిమాధవ్ బుర్రా, కె.విశ్వనాథ్, సమంత, మనోజ్ భాజ్ పేయి, ఇలియానా, మణిశర్మ, ఎస్.జె.సూర్య, బోనీ కపూర్, రామానాయుడు, శ్రీనివాసరెడ్డి, ఎమ్మెస్ నారాయణ, అసిన్, మైత్రీ నిర్మాతలు, అనూప్ రూబెన్స్, రాఘవేంద్ర రావు, సాయితేజ్, సంపూర్ణేష్ బాబు, శృతి హాసన్, దేవిశ్రీ ప్రసాద్, జానీ మాస్టర్ ఇతర సినీ సెలబ్రిటీలతో కలిసి దిగిన ఫోటోలతో తయారు చేసిన వీడియోను పవన్ పంచుకున్నారు.

అయితే ఈ వీడియోలో మోహన్ బాబు,( Mohan Babu ) అలీ( Ali ) కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.పవన్ కావాలనే వాళ్లిద్దరికీ వీడియోలో ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది.తనతో పని చేసిన చిన్న నటులకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ మోహన్ బాబు, అలీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఈ వీడియో ద్వారా హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను సైతం రిలీజ్ చేయడం జరిగింది.పవన్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube