సంక్రాంతికి పవన్ కళ్యాణ్ గిఫ్ట్‌ 'ఆహా' అనిపించడం ఖాయం

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో ఈ వారం ప్రభాస్ మరియు గోపీచంద్ సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

 Pawan Kalyan In Aha Balakrishna Unstoppable Talk Show ,pawan Kalyan , Balakrishn-TeluguStop.com

వారిద్దరికీ సంబంధించిన ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ఎదురు చూసిన సమయం లో అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివర్లోనే పవన్ కళ్యాణ్ టాక్ షో లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంటున్నారు.పవన్ కళ్యాణ్ తో పాటు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్ కూడా రాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ ముగ్గురి కలయికలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా రాబోతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు.ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు షూటింగ్‌ ప్రారంభం అవుతుందా.ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.ఈ సమయంలోనే ఆహా టీం నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతి కానుకగా ఈ టాక్ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంట.

అందుకు సంబంధించిన ఏర్పాటు ఇప్పటి నుండి జరుగుతున్నాయి అన్నట్లుగా తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ సినిమా ఈ సంక్రాంతికి రావడం లేదు.కానీ ఖచ్చితంగా ఈ సంక్రాంతి కి ఆయన ఆహా లో వచ్చి సందడి చేయడం ఖాయం అంటూ ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.ఆహా లో అతి పెద్ద టాక్ షో గా పవన్ కళ్యాణ్ రాక తో అన్ స్టాపబుల్ నిలవబోతోంది అంటూ బాలయ్య అభిమానులు కూడా సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

పవన్ రాక గురించి ఆహా అధికారికంగా ప్రకటన చేయడంతో అభిమానులు ఆనందంలో మునిగి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube