లాఠీ సినిమా చూడబోమంటూ విశాల్ పై పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్.. ఆ ఒక్క డైలాగ్ తో?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.పవన్ కళ్యాణ్ పై ఎవరైనా విమర్శలు గుప్పించిన కామెంట్స్ చేసిన చాలు అభిమానులు వెంటనే వారిపై మండిపడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు.

 Pawan Kalyan Fans Trolls Vishal , Pawan Kalyan , Vishal , Tollywood ,pawan Kalya-TeluguStop.com

తాజాగా హీరో విశాల్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేతిలో ట్రోల్స్ ని ఎదుర్కొంటున్నారు.విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం లాఠీ.

ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ ను బాగానే చేశారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పేరు గెలుచుకున్నారో లేక జెన్యూన్ గా మాట్లాడుకున్నారో తెలియదు కానీ ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పేరు వినిపించింది.

ఈ సందర్భంగా విషయాలు ఏం మాట్లాడారంటే.పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా ఇష్టమని, సినిమాలోకి రాకముందు నుంచి తనకు పవన్ కళ్యాణ్ తెలుసని తెలిపారు.విశాల్ తండ్రి చిరంజీవితో కలిసి ఎస్పీ పరశురాం సినిమా చేసినప్పుడే తాను పవన్ కళ్యాణ్ ని చూసినట్టు చెప్పుకొచ్చారు విశాల్.థియేటర్స్ లో పవన్ కళ్యాణ్ సినిమాలో విడుదల అయితే ఒక పండుగలా ఉంటుందని చెబుతూనే పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ ఏపీ సీఎం జగన్ గురించి మాట్లాడారు.

రాజకీయపరంగా తనకు జగన్ అంటే ఎంతో ఇష్టమని, ఏపీలో ఓటు హక్కు ఉంటే తప్పకుండా జగన్ కే ఓటు వేసేవాడిని అని తెలిపారు విశాల్ .అయితే ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

జగన్ అంటే ఇష్టం ఉన్నప్పుడు జగన్ నే పొగుడుకో కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ని ఎందుకు లాగడం అంటూ విశాల్ పై మండిపడుతున్నారు.అసలు ఏపీలో ఓటరు హక్కు లేనప్పుడు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అతను నటించిన లాఠీ సినిమాపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.చాలామంది పవన్ అభిమానులు లాఠీ సినిమా చూడము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube