పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు సినీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన తన సినీ కెరియర్ లో నటించిన చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో(Politics) కూడా కొనసాగుతున్నారు.ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ వరుస సినిమాలకు కమిట్ అవుతూ ప్రేక్షకులను సందడి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.
ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వారాహి యాత్ర(Varahi Yatra)ను కూడా కొనసాగిస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో నటించిన తక్కువ సినిమాలో అయినప్పటికీ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయని చెప్పాలి.ఇలా పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినటువంటి సినిమాలలో తొలిప్రేమ (Tholi Prema) ఒకటి.ఈ సినిమా విడుదలయ్యి పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరిగి జూన్ 30వ తేదీ థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేశారు.
దీంతో థియేటర్లలో ప్రేక్షకలు ఈ సినిమాను చూస్తూ పూనకాలతో ఊగిపోయారు.ఈ సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయడమే కాకుండా కొన్ని ప్రాంతాలలో అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రదర్శితమవుతున్నటువంటి సమయంలో కొన్ని థియేటర్లలో అభిమానులు అత్యుత్సాహం కనబడుతూ థియేటర్లను ధ్వంసం చేశారు.విజయవాడలోని కపర్ధి థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమైంది.అయితే ఈ సినిమా చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు స్క్రీన్లను చింపేయడమే కాకుండా, కుర్చీలు పగలకొడుతూ థియేటర్ మొత్తం చేశారు.
ఇలా ప్రేక్షకుల అత్యుత్సాహం కారణంగా సుమారు 6 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని థియేటర్ యాజమాన్యం లబోదిబోమంటున్నారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్ ఒక హీరో పట్ల అభిమానం ఉండాలి కానీ ఇలా ఇతరుల ఆస్తులను ధ్వంసం చేసే అంత అభిమానం ఉండకూడదని అభిమానం ఎప్పుడూ హద్దులు దాటకూడదు అంటూ ఈ వ్యవహారపై కామెంట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy