పవర్ స్టార్ , జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీతో జరిగిన సమావేశం అసంతృప్తిగానే ముగిసినట్లు కనిపిస్తుంది, సమావేశం తర్వాత మీడియా ముందు పవన్ స్పందించిన తీరుతో ఈ విషయం స్పష్టమవుతుంది.గత కొన్ని వారాలుగా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకునే దిశగా పవన్ ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.
దాదాపు 30 నిమిషాల పాటు ప్రధానితో పవన్ కళ్యాణ్ సమావేశం అవ్వడం ప్రాధన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో తాజా పరిణామాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఎందుకు పోరాడాల్సి వచ్చిందో పవన్.
మోడీకి వివరించినట్లు తెలిసింది.ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై హోం వర్క్ చేసి విశాఖపట్నం వచ్చిన పవన్ కళ్యాణ్ మోడీకి పూర్తి వివరాలు వెల్లడించనట్లుగా సమాచారం.
YSRCP రాజకీయ ప్రత్యర్థులు ఎలా టార్గెట్ చేస్తుంది అనే దానిపై పవన్ మోడీకి వినిపించారు.దీనికి “నాకు అన్నీ తెలుసు” అని మోడీ చెప్పినట్లు సమాచారం.
అయితే ఓట్లు చీలిపోకుండా విపక్షాల ఐక్యత అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సమాచారం.

మోడీ దీనిపై స్పందించలేదు, అయితే సమస్యలపై జగన్ ప్రభుత్వంపై పోరాటంలో పవన్ కళ్యాణ్‌కు బిజెపి నుండి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.‘‘రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. నా దగ్గర ఉన్న సమాచారాన్ని మోడితో పంచుకున్నాను.
ఆంద్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షించారు’ అని సమావేశం అనంతరం పవన్ విలేకరులకు తెలిపారు.ఆసక్తికరమైన విషయమేమిటంటే, మోడీతో భేటీ విచిత్రమైన పరిస్థితుల్లో జరిగిందని, అయితే దాని గురించి వివరించలేదు.
మోడీ హామీలతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ, సమావేశంపై పవన్ డైలమాలో ఉన్నట్లు కనిపిస్తోంది.బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తుకు మోదీ ఓకే చెప్పారా? లేక బీజేపీ-జనసేన మాత్రమే పొత్తు పెట్టుకున్నారా? అనేది స్పష్టంగా తెలియడం లేదు.ప్రస్తుతం ఈ విషయంలో పవన్ ఎటు తెల్చుకోలేకపోతున్నారు.