ఏలూరు జిల్లాలో మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు.దీనిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించారు.
అప్పర్ కాఫర్ డ్యాం, లోయర్ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, పవర్ ప్రాజెక్ట్, స్పిల్ వే పనులను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.అనంతరం ప్రాజెక్ట్ పనుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
గోదావరి నదికి వరద ప్రవాహం తగ్గడంతో పనులు వేగవంతం అయ్యాయని మంత్రి అంబటి తెలిపారు.లోయర్ కాఫర్ డ్యాం పనులు ప్రారంభం అయ్యాయన్నారు.
డయాఫ్రం వాల్ చుట్టూ ఉన్న నీటిని పూర్తిగా తొలగించాక పరిస్థితులను బట్టి రాక్ ఫీల్డ్ డ్యామ్ పనులు చేపడతామని వెల్లడించారు.సీడబ్య్లూసీ అనుమతులు ఇస్తే కానీ పనులు ప్రారంభించేందుకు అనుమతి లేదన్న ఆయన అప్పటి వరకు లోయర్ కాఫర్ డ్యాం పనులు చేస్తామని స్పష్టం చేశారు.







