పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఒక వైపు తన రాజకీయ ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తూనే మరోవైపు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వంలో నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustad Bhagath Singh ) చిత్రం నుంచి చిన్నపాటి టీజర్ రిలీజ్ చేశారు.ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది.

తాజాగా ఈ టీజర్ కనుక చూస్తే ఈ టీజర్ సినిమా కోసం కాకుండా జనసేన ( Janasena ) ప్రచారం కోసమే విడుదల చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది.ఈ టీజర్ లో భాగంగా పవన్ కళ్యాణ్‌కి పోలీస్ డ్రెస్ వేసి.టీజర్ మొత్తాన్ని జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ చుట్టూ తిప్పాడు హరీష్ .గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది.అంటూ పగిలిన గాజు గ్లాస్‌తో కసకసా విలన్లను ఊచకోత కోస్తున్నాడు పవన్ కళ్యాణ్.కచ్చితంగా గుర్తుపెట్టుకో గ్లాస్ అంటే సైజు కాదు ఒక సైన్యం అంటూ చెప్పినటువంటి ఈ డైలాగ్స్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఎంతగానో దోహదం చేస్తున్నాయి.

ఇకపోతే ఈ టీజర్ గురించి తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గాజు గ్లాస్‌ని కిందపడేస్తాడు.గాజు కిందపడి ముక్కలైపోతుంది.అసలు ఈ సీన్ ఎందుకు రాసావని నేను అడిగాను.దానికి హరీష్ మాట్లాడుతూ అందరూ కూడా మీరు ఓడిపోయారు.ఓడిపోయారని మాట్లాడుతున్నారు.
కానీ గాజు గ్లాస్ కు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే పగిలేకొద్దీ పదునెక్కుద్దని చెప్పాడు.నా సినిమాల్లో ఇలాంటి డైలాగ్‌లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు.
కానీ హరీష్ శంకర్ బాధ చూడలేక ఈ డైలాగ్ చెప్పాల్సి వచ్చింది అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.