Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

హెయిర్ ఫాల్( Hair Fall ). ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్కరు ఎదుర్కొంటున్న కామన్ సమస్య ఇది.

 This Home Remedy Is The Best Solution To Stop Hair Fall-TeluguStop.com

రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, ఒత్తిడి, చెడు వ్యసనాలు, రసాయనాలతో నిండిన జుట్టు ఉత్పత్తులను వాడటం తదితర అంశాలు హెయిర్ ఫాల్ కు కారణం అవుతుంటాయి.రీజన్ ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు సమర్థవంతంగా జుట్టు రాలడాన్ని అరికడతాయి.

ఈ నేపథ్యంలోనే హెయిర్ ఫాల్ కు బెస్ట్ సొల్యూషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అవిసె గింజలు.ఇది ఆరోగ్యపరంగా చేసే మేలు అంతా కాదు.అయితే జుట్టు సంరక్షణ( Hair Care )కు కూడా అవిసె గింజలు తోడ్పడతాయి.

అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారికి ఇవి అండగా నిలుస్తాయి.

-Telugu Health

అయితే అవిసె గింజలు( Flax Seeds ) జుట్టుకు సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలి అన్న విషయాన్ని పరిశీలిస్తే.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు వేసి ఉడికించాలి.

వాటర్ జెల్లీ స్ట్రక్చర్ లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ అవిసె గింజల జెల్ లో రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla Powder ), వన్ టేబుల్ స్పూన్ భృంగరాజ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

-Telugu Health

గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మీ జుట్టు ఊడమన్నా ఊడదు.హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు చెప్పుకున్న రెమెడీ చాలా బాగా సహాయపడుతుంది.వారానికి ఒక్క‌సారి ఈ రెమెడీని పాటించారంటే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.

అలాగే ఈ రెమెడీ మీ జుట్టును సిల్కీ గా, షైనీ గా( Silky and Shiny Hair ) మారుస్తుంది.హెయిర్ డ్యామేజ్ ను అరికడుతుంది.మరియు జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube