పవన్ కళ్యాణ్( Pawan kalyan ) సినిమా ఈవెంట్ అంటే చాలు ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది.అందరి హీరోల సినిమాల ఈవెంట్స్ కు భారీగా అభిమానులు వస్తారు అయితే పవర్ స్టార్ సినిమా ఈవెంట్ అంటే ఆ లెక్క కాస్త ఎక్కువగా ఉంటుంది.
పవన్ ఈవెంట్ అంటే చాలు అతని గురించి ఆయన స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పే కొన్ని సీప్చ్ లు ఉంటాయి.ముఖ్యంగా పవన్ ఈవెంట్ అనగానే ఆయన శిష్యుడు బండ్ల గణేష్ స్పీచ్ హైలెట్ అవుతుంది.
బండ్ల గణేష్( Bndla Ganesh ) స్పీచ్ అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఒక క్రేజ్.అయితే కొన్నాళ్లుగా గురువుకి దూరంగా ఉంటున్నాడు శిష్యుడు బండ్ల గణేష్.

ఇక మరోపక్క పవన్ గురించి చెప్పాలంటే అది ఒక్క త్రివిక్రం వల్లే సాధ్యం అనేలా ఆయన కూడా స్పీచ్ లు అందిస్తున్నాడు.పవన్ ఈవెంట్ లో త్రివిక్రం స్పీచ్ లను మంచి క్రేజ్ ఉంది.అయితే నిన్న జరిగిన బ్రో( BRO movie ) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అటు బండ్ల గణేష్ కానీ, ఇటు త్రివిక్రం కానీ ఇద్దరు మిస్ అయ్యారు.సో పవన్ కి ఎలివేషన్ ఇచ్చే స్పీచ్ లు తక్కువయ్యాయని చెప్పొచ్చు.
ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ ని నిరాశ పరచింది.







