ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు( Tomato Prices ) హాట్ టాపిక్ అవుతున్నాయి.టమాటా ధరలు ఊహించని స్థాయిలో పెరగడంతో కొనాలన్నా తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.
టమాటాలు అమ్మి ఇతర రాష్ట్రాల రైతులు ఊహించని మొత్తం సంపాదించడం గురించి మనం చాలా సందర్భాల్లో విన్నామనే సంగతి తెలిసిందే.అయితే ఏపీకి చెందిన చంద్రమౌళి( Farmer Chandramouli ) అనే రైతు టమాటాల ద్వారా 3 కోట్ల రూపాయలు సంపాదించారు.
70 లక్షల రూపాయలు ఖర్చు చేసి 32 ఎకరాలలో టమాటా పంట సాగు చేయగా చంద్రమౌళికి ఈ స్థాయిలో ఆదాయం వచ్చింది.3 కోట్ల రూపాయల ఆదాయం( Rs.3 Crore ) సంపాదించి తెలుగు రాష్ట్రాల్లోనే టమాటాలను సాగు చేయడం ద్వారా ఎక్కువ మొత్తం సంపాదించిన రైతుగా చంద్రమౌళి నిలిచారు.ఖర్చులు పోను చంద్రమౌళికి ఈ స్థాయిలో ఆదాయం దక్కిందని సమాచారం అందుతోంది.

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం, సువ్వారావుపల్లికి చెందిన చంద్రమౌళికి సొంతూరు కరకమందలో 12 ఎకరాల పొలం, సువ్వారాపుపల్లెలో 20 ఎకరాల పొలం ఉంది.టమాటా సాగు విషయంలో మంచి అనుభవం ఉన్న చంద్రమౌళి గత రెండు నెలల్లో 40 వేల టమాటా బాక్స్ లను విక్రయించి ఈ స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు.చాలా సందర్భాల్లో టమాటా నష్టాలను మిగిల్చినా చంద్రమౌళి మాత్రం ఈ పంటనే నమ్ముకోవడం గమనార్హం.

మొత్తం 4 కోట్ల రూపాయల ఆదాయం రాగా పెట్టుబడి, ఇతర ఖర్చులు తీసేస్తే మూడు కోట్ల రూపాయల లాభం వచ్చింది.సరైన సమయంలో సరైన పంటలు వేస్తే వ్యవసాయం( Agriculture ) ద్వారా కళ్లు చెదిరే ఆదాయం సంపాదించవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.టమాటాలు, ఉల్లి పంటల ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జూన్, జులైలో పంట చేతికి వచ్చేలా సాగు చేయడం రైతు చంద్రమౌళికి వరమైంది.







