Chalaki Chanti : బిగ్ బాస్ సిరిపై అలాంటి కామెంట్స్ చేసిన చలాకి చంటి .. వీడియో వైరల్?

తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సుమ ఏదైనా షో కి హోస్టుగా వ్యవహరిస్తోంది అంటే అందులో ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

 Chalaki Chanti Shocking Vulgar Comments On Siri-TeluguStop.com

చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తన కామెడీతో మాటలతో అలరిస్తూ ఉంటుంది.టీవీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్‌, సినిమా ఫంక్షన్స్, స్పెషల్ ఈవెంట్స్ ఆమె హోస్ట్ చేస్తుందంటే ఇక చెప్పక్కర్లేదు.

ఇకపోతే సుమ( Suma ) హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలలో ఇటీవలే మొదలైన షో సుమ అడ్డా.ఎంతోమంది సెలబ్రిటీలతో ఓ ఆట ఆడుకుని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుమ.

ప్రతి వారం లాగే ఈవారం జరగనున్న ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా( social media )లో వైరల్ గా మారింది.ఈసారి ఈ షో కి చలాకీ చంటి సిరి, హన్‌మంత్, సన్నీ( VJ sunny ), ఆర్జే కాజల్ వచ్చారు.సుమ తన స్టైల్లో సెటైర్స్ వేస్తూ, వాళ్లతో కలిసి సందడి చేసింది.

చంటికి సమోసాలిస్తూ సాలిడ్ పంచ్ వేసింది.రకరకాల గేమ్స్, క్వశ్చన్స్‌తో హంగామా చేసింది.

భారతదేశం యూనిఫామ్ నైటీ అంటూ అదిరిపోయే పంచ్ వేసింది.ఆ తర్వాత చత్రపతి లోని సూరీడు స్పూఫ్‌తో సన్నీని ఒక రేంజ్‌లో ఆడేసుకుంది.

తర్వాత విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ ఫ్యామిలీ ఫిలిం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుని సెలెక్ట్ చేసుకున్నారు.

చంటి( Chalaki Chanti ) ఆ పేరు చెప్తే ఇది టైటిల్‌లా లేదు, మీ రియల్ స్టోరీ ఏదో చెప్తున్నట్టుంది అంటూ అదరగొట్టేసింది.కాజల్.నేపాల్ నుంచి నాకోసం ఏం తీసుకొచ్చారు?’ అనడిగితే…నువ్వొక్కదానికి కష్టపడుతున్నావని పనమ్మాయిని తీసుకొచ్చాను.ఏ పనులు కావాలంటే ఆ పనులు చేయించుకో.ఓన్లీ సాయంత్రం పూట మాత్రం వదిలేస్తూ ఉండు అనగానే సుమ రియాక్షన్ అయితే అదుర్స్.చంటి పంచ్‌లకి అందరూ అరుస్తూ, కడుపుబ్బ నవ్వారు.

https://youtu.be/6MWDQozILAQ
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube