పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాని సాగర్ కే చంద్ర డైరక్షన్ చేస్తున్నాడు.
ఈ మల్టీ స్టారర్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇంకా ఈ సినిమా నుండి అప్డేట్ లు వచ్చిన దగ్గర నుండి భీమ్లా నాయక్ సందడి మొదలయ్యింది.
ఈ సినిమా నుండి వస్తున్నా సాంగ్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టు కుంటున్నాయి.ఇక తాజాగా ఈ సినిమా నుండి వచ్చిన టైటిల్ సాంగ్ సరి కొత్త రికార్డ్ అందుకుంది.దీంతో పవర్ స్టార్ మ్యానియా మరోకసారి నిరూపితం అయ్యింది.
ఎన్నడూ లేని విధంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 100 మిలియన్ మార్క్ ను టచ్ చేసి ఆశ్చర్య పరుస్తుంది.
ఇంత తక్కువ సమయంలోనే 100 మిలియన్ మార్క్ టచ్ చేయడం నిజంగా పవర్ స్టార్ మ్యానియా కనిపిస్తుంది.
ఈ విషయాన్ని స్వయంగా భీమ్లా నాయక్ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.బీమ్లా నాయక్ అంటూ సాగే ఈ పాటను రామ జోగయ్య శాస్త్రి రాయగా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించాడు.
సాంగ్స్ తోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే- డైలాగ్స్ అందిస్తున్నాడు.ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయినా ‘అయ్యప్పనుమ్ కోషియం’ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇందులో పవన్ కు జోడీగా నిత్యా మీనన్, రానా దగ్గుబాటి కి జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.మరి చూడాలి ఈ సినిమా విడుదల అయినా తర్వాత మరిన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో.