మరో రెండు రోజుల్లో ఉగాది ( Ugadi ) రాబోతుంది.తెలుగు వారికీ ఉగాది ఎంత స్పెషల్ అనేది చెప్పాల్సిన పని లేదు.
తెలుగు సంవత్సరాది అని అంతా అంటూ ఉంటారు.అందుకే స్టార్ హీరోలు కూడా ఉగాదికి తమ కొత్త సినిమాలను సరికొత్తగా ప్రకటిస్తారు.
అలాగే ప్రకటించిన సినిమాల నుండి కూడా ఏదొక అప్డేట్ ఇస్తుంటారు.మరి ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమాల నుండి అప్డేట్స్ వస్తున్నట్టు సమాచారం.
మరి ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న కొత్త సినిమా నుండి కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ రాబోతుంది అని టాక్.విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ రీమేక్ మూవీ వినోదయ సీతం.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్( Saidharam tej ) మెయిన్ లీడ్ లో నటిస్తుండగా.పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు.

పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మిస్తున్నాడు.ఇక థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 22 రోజులు మాత్రమే డేట్స్ కేటాయించాడు.అందుకే ఫాస్ట్ ఫాస్ట్ గా ఈ సినిమా షూట్ ను పూర్తి చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా నుండి వచ్చిన లీక్స్ చూసి అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ నుండి ఒక బజ్ బయటకు వచ్చింది.ఈ సినిమా నుండి కీలక అప్డేట్ ఉగాది కానుకగా రాబోతుంది అని తెలుస్తుంది.ఈ సినిమా టైటిల్ ను అయితే మేకర్స్ ఉగాది కానుకగా రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
దీంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.చూడాలి దీనిపై అధికారిక క్లారిటీ వస్తుందో లేదో.







