అదే జ‌న‌సేన పార్టీ కండువా.. ప‌వ‌న్ ఫిక్స్‌

రాజ‌కీయ పార్టీల‌కు గుర్తుతో పాటు కండువా కూడా కీల‌క‌మే!! కాంగ్రెస్‌కు మూడు వ‌ర్ణాలు గ‌ల జెండా, బీజేపీకి క‌మ‌లం గుర్తుగ‌ల కాషాయ జెండా, టీడీపీకి సైకిల్‌తో పాటు ప‌సుపు.ఇలా అన్నింటికీ గుర్తింపు పొందిన కండువాలు ఉన్నాయి.

 Pawan Kalyan About Janasena Party Towel-TeluguStop.com

ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా పార్టీ కండువాపై క్లారిటీ ఇచ్చాడా? శ్రామికుడి ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీకగా నిలిచే ఎర్ర తుండునే జ‌న‌సేన పార్టీ కండువాగా మార్చేయ‌బోతున్నాడా? అంటే అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు!!

జ‌న‌సేనను స్థాపించి పార్టీ లోగోను మాత్ర‌మే విడుద‌ల చేసిన ప‌వ‌న్‌.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

పార్టీని మ‌రింత బలోపేతం చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.ప‌వ‌న్ ఇప్పుడు పార్టీ కండువాపై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా ద్వారా అత్యంత ప్రాచుర్యం పొందిన ఎర్రతువ్వాలును పార్టీ కండువాగా మార్చే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట.ప‌వ‌న్‌లానే ఆ ఎర్ర కండువాకు యువ‌త‌లో బాగా క్రేజ్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే! దీంతో ఆ తువ్వాలునే పార్టీ కండువాగా ఫైన‌ల్ చేశాడ‌ని తెలుస్తోంది,

పవన్ కాస్త ఆల‌స్యంగానే అయినా పార్టీకి సంబంధించిన ఒక్కో విషయాన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నాడు.

ఇటీవ‌ల ప‌వ‌న్ అమెరికాలో ప‌ర్య‌టించిన‌పుడు ఆయ‌న అభిమానులు ఎర్ర తువ్వాలుతో ద‌ర్శ‌న‌మిచ్చారు.అలాగే ప‌వ‌న్ మాట్లాడుతున్న స‌మ‌యంలో ఆ తువ్వాలును మెడ‌లో వేసుకుని.

దాని గురించి చాలా గొప్ప‌గా చెప్పాడు.కష్టానికి గుర్తు, శ్రామికుల వస్త్రం అంటూ ఆ ఎర్ర తువ్వాలు గురించి చాలా గొప్పగా ఉన్నాడు పవన్.

అలాగే ఆ ఎర్ర టవల్ మన జీవనవిధానంలో భాగమన్న విషయాన్ని కూడా చెప్పాడు.

పవన్ మాటలను పరిశీలిస్తుంటే మాత్రం జనసేన పార్టీ కండువాగా ఆ ఎర్రతువ్వాలునే పవన్ ఫైనల్ చేస్తాడన్న మాటలు నిజమే అనిపిస్తున్నాయి.

ఈ కండువా సెలక్షన్ విషయంలో పవన్ నిర్ణయానికి ఫుల్ పాజిటివ్ మార్కులు పడే అవకాశం కూడా కనిపిస్తోంది.ఎక్కువ శాతం జనాభాకు రీచ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది.

పవన్ పార్టీ కండువాగా ఎర్ర తువ్వాలు దర్శనమిచ్చిందంటే మాత్రం స్టైల్ ఐకాన్‌గా కూడా ఆ టవల్ మారిపోతుందనడంలో సందేహం లేదు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube