మరి కాసేపటిలో అమరావతికి జనసేనాని పవన్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరి కాసేపటిలో అమరావతికి వెళ్లనున్నారు.గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే.

బీజేపీ అధిష్టానం నుంచి సమాచారం రాగానే ఢిల్లీకి పయనం కావాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే సిద్ధంగా ఉన్నారన్న సంగతి తెలిసిందే.అయితే బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు రాలేదని తెలుస్తోంది.

మరోవైపు పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది.దీంతో హైదరాబాద్ నుంచి జనసేనాని అమరావతికి బయలుదేరుతున్నారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల పర్యటన తరువాత ఆయన ఢిల్లీ పర్యటన ఉంటుందని జనసేన వర్గాలు చెబుతున్నట్లు సమాచారం.

Advertisement
పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు