సూర్యాపేట జిల్లా: అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని సిపిఎం సూర్యాపేట జిల్లా( Suryapet District ) కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి( Mallu Nagarjuna Reddy ) అన్నారు.గత ప్రభుత్వాల లాగా కేటాయింపులే కాకుండా వాటిని క్రమపద్ధతిలో ఖర్చు చేయాలన్నారు.
అంకెలగారడి కాకుండా అన్ని వర్గాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు చేయాలన్నారు.రైతులకు కొంతఊరట కల్పించిన, భవిష్యత్తులో రైతుబంధు( Rythu Bandhu )కు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో బడ్జెట్ స్పష్టత ఇవ్వలేదన్నారు.
బడ్జెట్ లో పేద,మధ్యతరగతి ప్రజలకు అధిక ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరికాదన్నారు.ఈ బడ్జెట్ మిశ్రమ ఫలితాలు ఇస్తుందని,పూర్తిస్థాయిలో మెజార్టీ ప్రజలకు ఉపయోగం లేదన్నారు