జన సైనికులు ఆశలపై నీళ్లు చల్లేస్తున్న పవన్ !!?

2024 ఎన్నికల నాటికి జనసేన ( Janasena )ను రాజకీయ క్షేత్రం లో కీలక స్థానంలో నిలపాలని ఆశపడుతున్న జనసైనికుల ఆశలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) నీళ్లు చల్లేస్తున్నారని ఇప్పుడు జనసైనికులు మధనపడుతున్నారట.తెల్లారి లేస్తే నియోజకవర్గాలలో క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు పార్టీ విధానాలను ఆశయాలను వివరిస్తూ నియోజకవర్గం వారి గా జనసేన ను బలపరచడానికి తాము నిరంతరం శ్రమిస్తూ ఉంటే ,పవన్ మాత్రం పొత్తులపై ఆధారపడి సినిమాలు చేసుకుంటున్నారని జనసైనికులు గుస్తా అవుతున్నారట.

 Pawan Kalyan Disapointing Party Cadre Details, Ap Politics,pilitics Latest News,-TeluguStop.com

అయినప్పటికీ అధినేత పై అభిమానంతో ( Pawan kalyan Fans )బయటపడలేకపోతున్నారని ఇన్సైడ్ టాక్ .

ఎన్నికల సంవత్సర అయినందున అధికార ప్రతిపక్ష నాయకులందరూ విపరీతంగా నియోజకవర్గాలలో తిరుగుతున్నారు .ఎండను సైతం లెక్కచేయకుండా 70 సంవత్సరాలు వయసులో చంద్రబాబుకు కూడా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళుతున్నారు.కానీ ఆరు నెలల క్రితమే ప్రచార వాహనం వారాహిని( Varahi vehicle ) తయారు చేయించి పెట్టుకున్న పవన్ దానిని ఇప్పటివరకు సినిమా అవసరాల కోసం మాత్రమే వాడుకున్నారు.

Telugu Ap, Chandrababu, Fans Janasena, Janasena, Pawan Kalyan, Pilitics Latest,

ఏదో ఒకటి రెండు పబ్లిక్ మీటింగ్లో తప్ప వారాహి ఎక్కడా కనిపించలేదు .ఇప్పుడు పవన్ మరో నాలుగు సినిమాలు వరుసగా ఒప్పుకోవటం రాజకీయంగా పవన్ లో సీరియస్నెస్ లేదని విమర్శలు వస్తున్నాయి.అయితే జగన్ గదింపడమే ఏకైక లక్ష్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాన్ని జగన్ ( Jagan )కేంద్రంగానే చూస్తున్నారని గ్రౌండ్ లెవెల్ లో కష్టపడుతున్న తెలుగుదేశానికి తాను అప్పుడప్పుడు వెళ్లి మద్దతు ఇస్తే సరిపోతుందన్నట్టుగా ఆయన వ్యవహారశాలి ఉందని, ఒక్కసారి జగన్ గద్దె దిగితే జనసేన అవసరం కూడా టిడిపికి తీరిపోతుందని అప్పుడు పవన్ ను చంద్రబాబు పట్టించుకోరని ఇప్పుడు తమ పార్టీ ఎటు కాకుండా పోతుందన్న ఆందోళనలో జనసైనికులు ఉన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.తమ అధినేత వ్యవహార శైలి చూస్తుంటే 2024 ను తెలుగుదేశానికి వదిలేసి 2029 లో రాజకీయాల్లో చేసుకుందామన్నట్లుగా ఉందని జనసైనికులు వాపోతున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube