మే 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.కృష్ణ భౌతికంగా మరణించినా తను నటించిన సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో జీవించి ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను కృష్ణ పుట్టినరోజున ప్రకటించడానికి ఆసక్తి చూపుతారనే సంగతి తెలిసిందే.మహేష్ త్రివిక్రమ్( Mahesh Trivikram ) కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రేపు రిలీజ్ కానున్నాయి.
మహేష్ కోసం త్రివిక్రమ్ గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది.ఈ టైటిల్ నే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం అందుతోంది.
మహేష్ అభిమానులు సైతం ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని చెబుతున్నారు.అయితే ఒకవైపు సినిమాలు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు తన సేవా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తుండటం గమనార్హం.

అయితే మహేష్ బాబు రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడారు.మహేష్ బాబు ఫౌండేషన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వయస్సు పెరుగుతున్నా మరింత అందంగా కనిపిస్తున్న మహేష్ బాబు తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా తన స్థాయిని పెంచుకుంటున్నారు.రెండు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడికి మహేష్ బాబు తాజాగా హార్ట్ సర్జరీ చేయించడం గమనార్హం.

రెండేళ్ల వయస్సు ఉన్న అమలాపురంకు( Amalapuram ) చెందిన కార్తికేయ( Karthikeya ) అనే బాలుడు గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ఈ విషయం మహేష్ బాబు ఫౌండేషన్ దృష్టికి వచ్చింది.మహేష్ చేసిన సహాయానికి బాలుడి తల్లీదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ బాలుడికి చికిత్స చేయించింది.ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని తెలుస్తోంది.మహేష్ బాబు ఫౌండేషన్ కష్టాల్లో ఉన్న ఎంతోమందిని ఇదే విధంగా ఆదుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.







