పవన్ కు ఇంగితజ్ఞానం లేదు..: మంత్రి అంబటి

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

పవన్ కు ఇంగితజ్ఞానం లేదన్న ఆయన చంద్రబాబు అవినీతిపరుడని గతంలో పవన్ అనలేదా అని ప్రశ్నించారు.

గతంలో ఆరోపణలు చేసి ఇప్పుడు ఎందుకు చంద్రబాబుకు మద్ధతు ఇస్తున్నారో చెప్పాలని మంత్రి అంబటి డిమాండ్ చేశారు.చంద్రబాబు అవినీతిలో పవన్ కు కూడా భాగం ఉందా అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే పవన్ ముందు తన పార్టీని రక్షించుకోవాలని అంబటి సూచించారు.అనంతరం చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడుతూ ఒక రాజకీయ నేత జైలుకు వెళ్లడం బాధాకరమేనన్నారు.

చంద్రబాబును జైలుకు పంపి ఆనందపడాల్సిన అవసరం ఎవరికీ లేదన్న మంత్రి అంబటి కక్ష పూరితంగా అరెస్ట్ చేశారనడం సరికాదని స్పష్టం చేశారు.ఈ క్రమంలోనే చంద్రబాబు హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలపై విచారణ జరగాలని తెలిపారు.

Advertisement
పుష్ప 2 లో అసలైన ట్విస్ట్ ఇదే...అదిరిపోయిందిగా...

తాజా వార్తలు