మోడీకి ఫ్యాన్ బాయ్ గా మారిపోయిన పవన్

సాధారణ రాజకీయ నేతలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని ఎందుకు ప్రత్యేకమైన నాయకుడి గా పరిగణిస్తారో పవన్ మరోసారి బిజేపి( BJP ) నిర్వహించిన బీసీ ఆత్మ గౌరవ స్పీచ్ ద్వారా నిరూపించుకున్నారు.జనసేన రాజకీయ విధానాలు చాలామందికి ద్వంద ప్రవృత్తి ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తాయి గానీ తనకు రాజకీయ అధికారం కన్నా ప్రజల అభ్యున్నతే ముఖ్యమని, తక్షణ పార్టీ ప్రయోజనాల కన్నా దేశానికి బలమైన నాయకత్వమే ముఖ్యమని పవన్ తన వ్యాఖ్యల ద్వారా నిరూపించినట్లయ్యింది.

 Pawan Has Become A Fan Boy Of Modi , Pawan Kalyan , Narendra Modi , Bjp Party-TeluguStop.com

ఎల్బీస్టేడియం లో జరిగిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదిని పవన్ ప్రశంసించిన విధానం పవన్ లో మోడి పట్ల ఒక ఫ్యాన్ బాయ్ ని దేశానికి చూపించింది.ఒకప్పుడు బాంబు దాడులతో దేశం అల్లకల్లోలం గా మారినప్పుడు దేశానికి బలమైన నాయకత్వం కావాలని తనలాంటి వేలాదిమంది కోరుకుంటే మోడీ వచ్చారని ,దేశ అంతర్గత భద్రత ప్రమాదకర పరిస్థితుల్లో పడినప్పుడు మోడీ తన విధానాల ద్వారా దేశానికి బలమైన నాయకత్వం అందించారని ,అందుకే తాను మోదీ ను( Narendra Modi ) అమితం గా ఇష్టపడతానంటూ పవన్ చెప్పుకొచ్చారు.

Telugu Bjp, Janasena, Narendra Modi, Pawan Kalyan-Telugu Political News

అవ్వడానికి తాను వేరే ఒక పార్టీకి అధ్యక్షుడు నాయనా కూడా బిజెపి నేతలు కన్నా ఎక్కువగా మోదీని పై ప్రేమ చూపించిన పవన్ మరొకసారి దేశానికి మోడీ నాయకత్వం అవసరం అంటూ నినదించారు.నిజానికి తెలుగు రాష్ట్రాలలో బిజెపి( BJP ) పట్ల అంత సానుకూల ధోరణి లేదు మైనారిటీలలో భాజపా పట్ల దాని మిత్ర పక్షాల పట్ల కూడా వ్యతిరేకత కనిపిస్తుంది.

Telugu Bjp, Janasena, Narendra Modi, Pawan Kalyan-Telugu Political News

అయినా కూడా తన పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మోడీని ని పవన్ ప్రశంసించిన విధానం చూస్తే మోడీ నాయకత్వం తో దేశం సుభిక్షంగా ఉంటుందని పవన్ బలంగానే నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు వంటి కీలకమైన ఘట్టాలు మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైనయని పవన్ చెప్పుకొచ్చారు .తెలంగాణ కల సాక్షాత్కారమైనా కూడా దాని మౌలిక సూత్రాలు పరిరక్షించబడలేదని చెప్పుకొచ్చిన పవన్, బిజెపితోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.మోదీ పట్ల ఈ విదమైన స్టాండ్ తీసుకోవడం ద్వారా కొన్ని వర్గాలకు తాను దూరమవుతానని స్పష్టమైన సంకేతాలు ఉన్నా కూడా తాను నమ్మిన విషయాలను పట్ల తన కమిట్మెంట్ ఎంతో పవన్( Pawan Kalyan ) తన వ్యాఖ్యల ద్వారా నిరూపించుకున్నారని జనసేన వర్గాలు వాఖ్యనిస్తున్నాయి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube