మోడీకి ఫ్యాన్ బాయ్ గా మారిపోయిన పవన్

సాధారణ రాజకీయ నేతలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ని ఎందుకు ప్రత్యేకమైన నాయకుడి గా పరిగణిస్తారో పవన్ మరోసారి బిజేపి( BJP ) నిర్వహించిన బీసీ ఆత్మ గౌరవ స్పీచ్ ద్వారా నిరూపించుకున్నారు.

జనసేన రాజకీయ విధానాలు చాలామందికి ద్వంద ప్రవృత్తి ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తాయి గానీ తనకు రాజకీయ అధికారం కన్నా ప్రజల అభ్యున్నతే ముఖ్యమని, తక్షణ పార్టీ ప్రయోజనాల కన్నా దేశానికి బలమైన నాయకత్వమే ముఖ్యమని పవన్ తన వ్యాఖ్యల ద్వారా నిరూపించినట్లయ్యింది.

ఎల్బీస్టేడియం లో జరిగిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదిని పవన్ ప్రశంసించిన విధానం పవన్ లో మోడి పట్ల ఒక ఫ్యాన్ బాయ్ ని దేశానికి చూపించింది.

ఒకప్పుడు బాంబు దాడులతో దేశం అల్లకల్లోలం గా మారినప్పుడు దేశానికి బలమైన నాయకత్వం కావాలని తనలాంటి వేలాదిమంది కోరుకుంటే మోడీ వచ్చారని ,దేశ అంతర్గత భద్రత ప్రమాదకర పరిస్థితుల్లో పడినప్పుడు మోడీ తన విధానాల ద్వారా దేశానికి బలమైన నాయకత్వం అందించారని ,అందుకే తాను మోదీ ను( Narendra Modi ) అమితం గా ఇష్టపడతానంటూ పవన్ చెప్పుకొచ్చారు.

"""/" / అవ్వడానికి తాను వేరే ఒక పార్టీకి అధ్యక్షుడు నాయనా కూడా బిజెపి నేతలు కన్నా ఎక్కువగా మోదీని పై ప్రేమ చూపించిన పవన్ మరొకసారి దేశానికి మోడీ నాయకత్వం అవసరం అంటూ నినదించారు.

నిజానికి తెలుగు రాష్ట్రాలలో బిజెపి( BJP ) పట్ల అంత సానుకూల ధోరణి లేదు మైనారిటీలలో భాజపా పట్ల దాని మిత్ర పక్షాల పట్ల కూడా వ్యతిరేకత కనిపిస్తుంది.

"""/" / అయినా కూడా తన పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మోడీని ని పవన్ ప్రశంసించిన విధానం చూస్తే మోడీ నాయకత్వం తో దేశం సుభిక్షంగా ఉంటుందని పవన్ బలంగానే నమ్ముతున్నట్లు కనిపిస్తుంది.

రామ మందిరం నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు వంటి కీలకమైన ఘట్టాలు మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైనయని పవన్ చెప్పుకొచ్చారు .

తెలంగాణ కల సాక్షాత్కారమైనా కూడా దాని మౌలిక సూత్రాలు పరిరక్షించబడలేదని చెప్పుకొచ్చిన పవన్, బిజెపితోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

మోదీ పట్ల ఈ విదమైన స్టాండ్ తీసుకోవడం ద్వారా కొన్ని వర్గాలకు తాను దూరమవుతానని స్పష్టమైన సంకేతాలు ఉన్నా కూడా తాను నమ్మిన విషయాలను పట్ల తన కమిట్మెంట్ ఎంతో పవన్( Pawan Kalyan ) తన వ్యాఖ్యల ద్వారా నిరూపించుకున్నారని జనసేన వర్గాలు వాఖ్యనిస్తున్నాయి .

డొక్కు కారులో ఫ్రెండ్స్ రోడ్డు ట్రిప్.. 2000 కి.మీ టార్గెట్.. కానీ..?