కుక్కను పర్వతంపైకి మోసినందుకు రూ.11 వేలు.. దీని రాజభోగాలు తెలిస్తే!

చైనా( China )కు చెందిన ఒక మహిళ తన డాగ్స్‌ను తనతో పాటే అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తోంది.ఇటీవల ట్రెక్కింగ్ సాహస యాత్రలో భాగంగా ఆమె తన కుక్కలతో కలిసి అద్భుతమైన సౌందర్యాలతో కూడిన పవిత్ర ప్రదేశమైన సాన్‌కింగ్( Mount Sanqing ) పర్వతానికి వెళ్ళింది.

 Rs 11 Thousand For Carrying A Dog Up The Mountain-TeluguStop.com

అయితే, ఆమె కుక్కలలో ఒకటి పర్వతం పైకి ఎక్కేందుకు కష్టపడింది, అది 40 కిలోమీటర్ల పొడవైన కాలిబాటలో నడవడానికి నిరాకరించింది.తన పెంపుడు జంతువును కిందే వదిలేయాలని యజమాని అనుకోలేదు.

ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆ లేడీ ఓనర్ కొద్దిసేపు ఆలోచించింది.చివరికి ఒక ఐడియా ఆమెకు తట్టింది.

ఆమె తన కుక్కను పర్వతం పైకి తీసుకెళ్లడానికి ఇద్దరు పురుషులను నియమించుకుంది.

Telugu Chair, China, Dog Lover, Douyin, Mount, Pet, Mountain-Telugu NRI

ఈ సర్వీస్ కోసం మహిళ 980 యువాన్ ధరను చెల్లించింది.ఇది దాదాపు రూ.11,000 సమానం.ఆమె తన కుక్క రైడ్‌ను ఆస్వాదిస్తున్న వీడియోను రికార్డ్ చేసింది.దానిని ప్రముఖ చైనీస్ సోషల్ మీడియా( Social media ) ప్లాట్‌ఫామ్ అయిన డౌయిన్‌లో షేర్ చేసింది.

ఈ వీడియో వైరల్‌గా మారింది.చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది, వారు తన కుక్క పట్ల ఆ మహిళకు ఉన్న ప్రేమను చూసి ఆనందించారు.

జంతువులపై మనుషులు ఎక్కే ప్రయాణించడం చూసాం కానీ మనుషులపై జంతువులు ఎక్కి చూడటం ఇదే తొలిసారి అని మరి కొందరు కామెంట్లు పెట్టారు ఆ కుక్క రాజ భోగాలు మామూలుగా లేవని ఇంకొందరు వ్యాఖ్యానించారు.

Telugu Chair, China, Dog Lover, Douyin, Mount, Pet, Mountain-Telugu NRI

ఈ కుక్క యజమాని హైర్‌ చేసుకున్న చైర్ సర్వీస్ వాస్తవానికి పర్వతాన్ని ఎక్కడానికి సహాయం అవసరమైన హ్యూమన్ విజిటర్స్ కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.సాన్‌క్వింగ్ మౌంటైన్ టూర్ కంపెనీ ప్రతినిధి ప్రకారం, కుక్కలు సాధారణంగా వాటి యజమానులు తమ మంచి ప్రవర్తనకు హామీ ఇస్తే తప్ప ఈ సర్వీస్ అందించడానికి ఎవరూ ముందుకు రారు ఎందుకంటే కుక్కలు బ్యాడ్ గా ప్రవర్తించి కరి చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది.అయితే ఆ లేడీ ఓనర్ చెప్పిన ప్రకారం కుక్క బుద్ధిగా కుర్చీలో కూర్చొని ప్రయాణించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube