వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.మూడు రాజధానులను ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారా అని ప్రశ్నించారు.
మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా అని నిలదీశారు.అంతేకాకుండా విశాఖపట్నంలో రుషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకుంటున్నందుకా? లేక దసపల్లా భూములను సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?’ అని ప్రశ్నించారు.







