విజయనగరం ఆస్పత్రి పేరు మార్పుపై డిప్యూటీ స్పీకర్ కామెంట్స్

విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రి పేరు మార్పుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్పందించారు.ఇకపై ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగానే కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

 Deputy Speaker Comments On Name Change Of Vizianagaram Hospital-TeluguStop.com

గతంలో మహారాజా పేరు పెట్టారంటే.అది అప్పట్లో పీవీజీ రాజుపై ఉన్న గౌరవమన్నారు.

దానిపై ఇంతవరకు ఎటువంటి అభ్యంతరాలు లేవన్నారు.వైద్య విధానం పరిషత్ నిబంధనల ప్రకారం ఇకపై ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిగానే కొనసాగుతుందని కోలగట్ల పేర్కొన్నారు.

ఆస్పత్రి ప్రభుత్వ స్థలంలో ఉందన్న ఆయన.అశోక్ గజపతి రాజు కుటుంబం స్థలం ఇచ్చినట్లైతే రుజువులు చూపించాలని తెలిపారు.గత ప్రభుత్వ హయాంలో మహారాజా పేరిట ఏదైనా కార్యక్రమం చేశారా అని ప్రశ్నించారు.అధికారంలో ఉంటే చంద్రబాబుకు కానీ, విమర్శించే నేతలకు గానీ ఆయన పేరు గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube