పవన్ ఆశలు అడియాశలేనా ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించే లక్ష్యంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ఈసారి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని, కింగ్ మేకర్ కావాలని పవన్ గట్టిగానే కలలు కంటున్నారు.

 Pawan Backs Down On The Post Of Cm, Pawan Kalyan, Jana Sena, Cm Post, Tdp, Chan-TeluguStop.com

అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికి ఇటు టీడీపీతో కూడా స్నేహం చేస్తున్నారు పవన్.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయబుతున్నట్లు ఇప్పటికే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు కూడా.ఇకపోతే ఈసారి సి‌ఎం పదవే లక్ష్యంగా తన స్ట్రాటజీలు కొనసాగిస్తున్నారు జనసేనాని.

Telugu Chandra Babu, Cm, Jana Sena, Janasena, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Pol

వచ్చే ఎన్నికల్లో జనసేన( Jana sena ) బలమైన ముద్ర వేస్తుందని పొత్తులో ఉన్నప్పటికి.సి‌ఎం పదవి తన టార్గెట్ అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు.ఏపీలో జనసేన బలం రోజురోజుకూ పెరుగుతుండడంతో టీడీపీ జనసేన కూటమి తరుపున సి‌ఎం అభ్యర్థిగా పవనే ఉంటారనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది.ఇంతలోనే తెలంగాణ ఎన్నికల్లో జనసేన ఎంట్రీ ఇవ్వడం ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఘోర పరాభవం ఎదురుకావడంతో పవన్ ఏపీలో కొంత స్లో అయినట్లే తెలుస్తోంది.

సేమ్ రిజల్ట్స్ ఏపీలో కూడా నమోదైతే పరిస్థితి ఏంటనే దానిపై పవన్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

Telugu Chandra Babu, Cm, Jana Sena, Janasena, Lokesh, Pawan Kalyan, Ys Jagan-Pol

అందుకే సి‌ఎం పదవి విషయంలో పవన్ కొంత వెనకడుగు వేశారనే టాక్ వినిపిస్తోంది.మొన్నటి వరకు సి‌ఎం పదవే టార్గెట్ అన్న పవన్.ఇప్పుడు ముందు సీట్లు గెలవాలని.

ఆ తరువాతే సి‌ఎం పదవి అనే నినాదంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఇటీవల విశాఖలో జరిగిన సభలో సి‌ఎం పదవి విషయంలో నోరు విప్పారాయన.30 నుంచి 40 సీట్లు సొంతం చేసుకున్నప్పుడే సి‌ఎం పదవి అడగొచ్చని, ఆ దిశగా జనసేన పార్టీని ఆదరించాలని కోరారు.అయితే పవన్ ఆశిస్తున్నట్లుగా జనసేన పార్టీ 40 సీట్లు సొంతం చేసుకునే అవకాశం ఉందా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

మరి ఏపీలో కూడా తెలంగాణ మాదిరి జనసేన కు వ్యతిరేకత గాలి విస్తే సి‌ఎం పదవిపై పవన్ ఆశలు అడియాశలు అయినట్లే అంటున్నారు కొందరు రాజకీయవాదులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube