చింత చిగురు పచ్చడి దగ్గర నుండి చాపల పులుసు వరకు చింతచిగురును( Tamarind leaves ) విరివిగా ఉపయోగిస్తారు.చాలామందికి చింత పండు తెలుసు కానీ, చింతచిగురు గురించి పెద్దగా తెలిసి ఉండదు.
అలాంటి వాళ్ళు చింత చిగురులో ఎన్ని బెనిఫిట్స్ దాగి ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు.అయితే వెజ్ నాన్ వెజ్ వంటలలో రుచికోసం చింతచిగురుని వాడవచ్చు.
అలాగే ఎండబెట్టి కూడా నిల్వ చేసుకోవచ్చు.ముఖ్యంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో చింతచిగురు వాడకం ఎక్కువగా ఉంటుంది.
ఇది కేవలం రుచికి మాత్రమే కాకుండా దీనిని ఉపయోగించడం వలన పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

చింత చిగురు పప్పు, రొయ్యల ఇగురు, చింతచిగురు పచ్చడి వేడి వేడి అన్నంతో తీసుకుంటే ఏ కాంబినేషన్ అయినా కూడా నోట్లో నీళ్లు వచ్చేలా ఉంటుంది.మరి ఇంత టేస్టీ చింతచిగురులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇందులో ఐరన్ ( Iron )కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
అందుకే ఇది మనలో రక్తహీనత సమస్యను అదుపులో ఉంచుతుంది.అలాగే చిన్నపిల్లలకి చింత చిగురు పెట్టడం వలన బలం కూడా చేకూరుతుంది.
ఇక కామెర్ల వ్యాధితో బాధపడుతున్న వారు చింతచిగురు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.ఎందుకంటే కామెర్లతో బాధపడే వారికి చింతచిగురు రసం తటిక బెల్లంతో కలిపి ఇస్తే మంచిది.
చింతచిగురు ఆహారంలో తీసుకోవడం వలన వాతం వంటి లక్షణాలు తగ్గడమే కాకుండా కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయి.

ఇక గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్( Sore throat, infection ) లాంటి సమస్యలకు కూడా చింతచిగురు బాగా పనిచేస్తుంది.చింతచిగురు క్రమం తప్పకుండా తీసుకోవడం వలన కడుపులో ఉన్న నులిపురుగులు కూడా చనిపోతాయి.ఇక చింతచిగురుని తినడం వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇక థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న వారు చింతచిగురు తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా ఇందులో అధిక మోతాదులో లభించే ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొవ్వును కూడా తగ్గించి మంచి కొవ్వును పెంచుతాయి.
అలాగే జీర్ణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తాయి.







