పవిత్ర లోకేష్(Pavitra Lokesh) ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సేషనల్ గా నిలిచినటువంటి వారిలో ఒకరు.టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్(Naresh) తో రిలేషన్ లో ఉండడంతో ఒక్కసారిగా వీరిద్దరూ సంచలనంగా మారారు.
ఇక వీరిద్దరూ జంటగా మళ్లీ పెళ్లి (Malli Pelli) అనే సినిమా చేయడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్ అయ్యారని చెప్పాలి.ఇక ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ ఫలితాలను అందుకుంది.
ఈ సినిమా ద్వారా నరేష్ పవిత్ర లోకేష్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

ఇకపోతే నరేష్ పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి పక్కన పెడితే తాజాగా పవిత్ర లోకేష్ చేసినటువంటి ఒక పని తెలిసి నేటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.పవిత్ర చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారంటూ ఈ విషయంలో ఆమె చాలా గ్రేట్ అంటూ తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇలా అంత గొప్ప పని పవిత్ర లోకేష్ ఏం చేసింది అనే విషయానికి వస్తే.
ఈమె తన మాతృభాష అయినటువంటి కన్నడ సాహిత్యంలో పిహెచ్ డీ(Ph.D) చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ క్రమంలోనే పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాయడం కోసం ఏమి తాజాగా బళ్లారి వెళ్లారు.

ఈ క్రమంలోనే హంపి కన్నడ యూనివర్సిటీలో ఈమె పీహెచ్డీ ప్రవేశ పరీక్ష రాసింది.అయితే పవిత్రను స్వయంగా నరేష్ (Naresh) దగ్గరుండి ఈ పరీక్ష రాయడానికి తీసుకువెళ్లి ఆమె చేత ఈ పరీక్ష రాయించారని తెలుస్తుంది.పవిత్ర లోకేష్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అన్ని భాషలలోనూ సినిమాలు చేస్తున్నారు.
అయినప్పటికీ ఈమె తన మాతృభాషపై ఎంతో మమకారం ఉందని అందుకే కన్నడ భాషసాహిత్యంలో ఏకంగా పీహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలియడంతో ఈమె పట్టుదలపై నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.