పవన్ కళ్యాణ్ : పొత్తులు కాదు అప్పుల సంగతేంటి ?

ఏపీలో టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయి అని గత కొంతకాలంగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

దీనికి తగ్గట్లుగానే గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.

వైసిపి ఓటు బ్యాంకు ను చీల్చేందుకు తనకు ఇష్టం లేదని,  వైసీపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమవ్వాలి అంటూ మాట్లాడిన మాటలు,  అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఇదే విధంగా అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించడంతో టిడిపి,  జనసేన పార్టీ ఎన్నికల సమయం నాటికి ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాయి అనే అభిప్రాయానికి దాదాపు అంతా వచ్చేసారు.ప్రస్తుతం పవన్ ఎక్కడ పర్యటించిన ఈ పొత్తుల అంశంపై ఆయనకు అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

వైసిపి నాయకులు సైతం టిడిపి జనసేన పొత్తు అంశంపై పదేపదే ఆ విధంగా మాట్లాడుతూ ఉండడం వంటి వ్యవహారాలు పవన్ కళ్యాణ్ స్పందించారు.  శ్రీలంక నుంచి తమిళనాడు కి గంట దూరం - శ్రీలంక పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ కూతవేటు దూరం.

ఇంకా లేని పొత్తుల గురించి విమర్శించడం గడపగడపకు ఎమ్మెల్యేలను పంపడం కాదు.చేయవలసింది, మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్ ను దూరం జరిపే ప్రయత్నం చేయండి అంటూ పవన్ కళ్యాణ్ నేషనల్ మీడియాలో వచ్చిన న్యూస్ ను టైప్ చేస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

   ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలకు భారీగా ఖర్చు పెడుతూ ఉండడంతో.గత కొంత కాలంగా దుమారం రేగుతోంది.

 ఏపీకి సరైన ఆదాయ మార్గాలు లేకపోవడం,  అభివృద్ధి చోటు చేసుకోకపోవడం వంటివి చేసుకుంటున్న జగన్ మాత్రం వేల కోట్లు అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలకు ఖర్చు పెడుతుండటం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే పవన్ ఈ విధంగా స్పందించినట్టు గా కనిపిస్తున్నారు. 

 ఇక పవన్ తన ట్వీట్ లో లేని పొత్తుల గురించి విమర్శించడం అంటూ వ్యాఖ్యానించడం మాత్రం అనేక సందేహాలకు కారణం అవుతోంది.ప్రస్తుతం బిజెపి జనసేన పార్టీలో పొత్తు కొనసాగుతుంది.ఏపీలో జనసేన ను సొంతంగా బలోపేతం చేసే విషయంపై పవన్ దృష్టి పెట్టారు.

క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు ఏపీలో పర్యటనలు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో మరింత జనాల్లోకి పార్టీ క్యాడర్ ను పంపడం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

భారీ బహిరంగ సభలు నిర్వహించే విధంగా పవన్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు