మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం టూర్ కు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేశారు.భారీగా జన సమీకరణ చేపట్టారు.
అతిరథ మహారథులను ప్రధాని సభకు ఆహ్వానించారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రధాని పర్యటన బాధ్యతలను తీసుకుని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.
వివిధ రాజకీయ పార్టీల నేతలను ప్రధాని సభకు ఆహ్వానించారు.భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు.
వైసిపి, టిడిపి, పార్టీలతో పాటు జనసేనకు ప్రధాని సభకు రావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి.అయితే బిజెపితో ఏపీలో పొత్తు కొనసాగిస్తున్న జనసేన మాత్రం ప్రధాని భీమవరం పర్యటన విషయంలో ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉంది.
ప్రధాని సభలో పాల్గొనాలా వద్ద అనే క్లారిటీ లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు.అయితే ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు పవన్ దీనిపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు.ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అద్భుతమైన కార్యక్రమంగా పవన్ ప్రశంసించారు.దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోధుడి గొప్పతనం గురించి యావత్ ప్రపంచానికి తెలియజేయడానికి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమన్నారు.అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కు వస్తున్న ప్రధానికి పవన్ శుభాభినందనలు తెలిపారు.
భీమవరంలో పోటీ చేసిన తనకు ఇది ప్రత్యేకమని పవన్ చెప్పారు.
జనసేన నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పవన్ సూచించారు.

పవన్ ప్రధాని సభకు రాకపోయినా, పవన్ సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి మాత్రం ఈ సభకు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమం కావడంతో పాటు, అల్లూరు సీతారామరాజుకు గౌరవంగా నిర్వహిస్తుండడంతో ఈ సభకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారట.అయితే పవన్ ఈ సభకు హాజరు కాకపోవడానికి ఏపీ సీఎం జగన్ కారణమనే ప్రచారం జరుగుతోంది.ప్రధాని గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి నుంచి భీమవరం సభ ముగిసి మళ్లీ ఆయన గన్నవరం నుంచి వెళ్లే వరకు ఏపీ సీఎం జగన్ ఆయన వెంటే ఉండబోతూ ఉండడంతో పవన్ వెనక్కి తగ్గారనే ప్రచారం జరుగుతోంది.
అదీ కాకుండా ప్రధాని సభలో తనకు సరైన ప్రాధాన్యం దక్కదు అనే ముందస్తు అంచనాతో పవన్ భీమవరం రాకను విరమించుకున్నట్టుగా కనిపిస్తున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.