రైలులో వ్యక్తికి గుండెపోటు.. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన టీటీఈ (వీడియో)

కరోనా వచ్చి వెళ్లిన తర్వాత ప్రజలలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

ఇందులో భాగంగా గత కొద్దీ కాలం నుంచి అనేకమంది ఉన్నట్టుండి గుండెపోటు( Heart Attacks ) మరణాల కలకలం ఎక్కువైపోయింది.

అప్పటి వరకు మనతోనే ఉండి మాట్లాడుతూ.సరదాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పరలోకానికి చేరే ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రతినిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి.అయితే, కొన్ని సందర్భాల్లో హార్ట్ ఎటాక్ గురైన సమయంలో సరైన వ్యక్తి సిపిఆర్( CPR ) అందించడం ద్వారా కొందరు బతికి ప్రాణాలతో బయటపడుతున్నారు.

ఇలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

నార్త్ ఈస్టర్న్ రైల్వే( North Eastern Railway ) సోషల్ మీడియా వేదికగా వీడియోను పంచుకుంది.ఈ వీడియోలో సిపిఆర్ చేయడం ద్వారా టీటీఈ( TTE ) ఓ ప్రయాణికుడి ప్రాణాలను రక్షించడం మనకు కనబడుతుంది.రన్నింగ్ లో ఉన్న రైలులో ఓ ప్రయాణికుడికి గురి కావడంతో అతడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా టీటీఈ అతనికి సిపిఆర్ అందించే ప్రాణాన్ని నిలిపాడని అధికారులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది.రైలు నెంబర్ - 15708 ఆమ్రపాలి ఎక్స్ప్రెస్( Amrapali Express ) జనరల్ కోచ్ లో ప్రయాణం చేస్తున్న ఓ 70 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు.

దీంతో అతడు వెంటనే స్పృహ కోల్పోయి పడిపోయాడు.అయితే, అదే సమయంలో ఆ కోచ్ లోనే ఉన్న టీటీఈ మన్మోహన్( TTE Manmohan ) వెంటనే స్పందించి సదరు వ్యక్తికి సిపిఆర్ అందించి కొద్ది క్షణాల్లో అతడికి ప్రాణం పోసాడని చెప్పవచ్చు.

వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?
అబ్బా.. పచ్చిమిర్చి కట్ చేయడానికి పెద్ద ప్లానే వేసిందిగా (వీడియో)

కళ్ళు తెరిచి చూడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ఆ తర్వాత స్టేషన్ చెఫ్రా రైల్వే స్టేషన్లో రైల్వే ఆసుపత్రికి అధికారులు తరలించారు.ఇక ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు టీటీఈ చేసిన పనికి బిగ్ సెల్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.మరోవైపు రైల్వే అధికారులు కూడా టీటీఈ మన్మోహన్ ను ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

అతని ధైర్యం చాకచక్యం ప్రదర్శించిన తీరు గొప్పవాళ్లు కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు