అర్జున్ రెడ్డి లాంటి చెత్త సినిమా... పార్వతి కామెంట్స్! విజయ్ కౌంటర్

అర్జున్ రెడ్డి సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి రెండేళ్ళకి పైగా అయిపొయింది.

ఇక ఈ సినిమా హిందీ, తమిళ భాషలలలో కూడా రీమేక్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఆయా భాషలలో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా, హీరోలకి ఇమేజ్ పరంగా సూపర్ మైలేజ్ తీసుకొచ్చింది.అయితే అర్జున్ రెడ్డి సినిమా మీద వివాదం మాత్రం ఇప్పటికి పోలేదు.

అందులో ప్రేమికుల మధ్య రొమాన్స్ కొట్టుకునేంత వరకు ఉంటుంది.దీనిని చాలా మంది బయట వ్యతిరేకించారు.

ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకోవడంలో అసలు ప్రేమేంటో అని విమర్శలు చేసారు.వారి దారిలో తాజాగా మలయాళీ నటి పార్వతీ మీనన్ కూడా చేరిపోయింది.

Advertisement

తాజాగా ఫిలిం ఫేర్ ఫంక్షన్ లో అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ముందే ఆ సినిమాపై కామెంట్స్ చేసింది.అర్జున్ రెడ్డి సినిమాలో ప్రేమలో హింసను గొప్ప విషయంగా చూపించారు.

పైగా చాలామంది జనాలు అది సాధారణం అన్నట్టుగా స్పందించడం సరికాదు.అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ లో హింసను ఒక గొప్ప విషయంగా చూపించారు.

దానికి తోడు చెంపదెబ్బలు కొట్టుకుంటేనే ఒక రిలేషన్ లో తీవ్రత ఉన్నట్టు లేకపోతే లేనట్టుగా చెప్పడం సరి కాదు అంటూ చెప్పుకొచ్చింది.దీనిపై విజయ్ దేవరకొండ స్పందిస్తూ ఇలాంటి కామెంట్స్ వల్ల నాకు చాలా విసుగుపుడుతోంది.

ఒక జంట ఏదో ఒక సందర్భంలో చెంప దెబ్బ కొట్టుకోవచ్చు.అలాంటి జంటలు ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ఓపెన్ గా అర్థం చేసుకోగలరు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

పార్వతి ఎ ఉద్దేశ్యంతో తన భావాన్ని వ్యక్తపరిచిందో నేను అర్ధం చేసుకోగలను.కాని సోషల్ మీడియాలో ఈ న్యూసెన్స్ మాత్రం బాగోలేదు అంటూ కామెంట్ చేసాడు.

Advertisement

తాజా వార్తలు