అప్పడాలు తింటే కరోనా రాదంట!

ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.

ఈ మహమ్మారి వైరస్ కు విరుగుడు కూడా రాకపోవడంతో ప్రజలందరూ ఈ వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయాలు ఏమిటి అన్న దానిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది చిత్ర విచిత్ర ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా చేస్తున్నారు.ఈ ప్రచారంలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా ప్రజలు తేల్చుకోలేని పరిస్థితి నెలకొంటుంది.

ఎన్నో వింత ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయి ప్రజలందరినీ అయోమయంలో పడి వేసిన విషయం తెలిసిందే.తాజాగా అప్పడాలు తింటే కరోనా వైరస్ పోతుంది అంటున్నారు.

అది కూడా ఎవరో కాదు కేంద్ర సహాయ మంత్రి ఇలా అంటుండడం ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారింది.ఆత్మ నిర్మల్ భారత్ పథకం కింద అప్పడాలు తయారు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అర్జున్ మేఘ్వల్ వెల్లడించారు.

Advertisement

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ట్రీట్ పెట్టగా ఇది కాస్త వైరల్ అయింది.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారత దేశాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బర్ భారత్ పేరిట 20 లక్షల భారీ నిధులను కేటాయించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అప్పడాలు తయారు చేసి బాబీ జి పాపడ్ అనే పేరుతో మార్కెట్లోకి విడుదల చేశారు సహాయమంత్రి అర్జున్ మేగ్వాల్.

అయితే తాజాగా కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలపై కొంత మంది మండి పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు