ఏపీలో ప్రత్యక్షం అయినా అలుగు.. జనాలు ఏం చేశారంటే ?

మామూలుగా చాలామంది ఎన్నో జంతువులు చూసి ఉంటారు.కానీ అలుగు లాంటి జంతువును చూడటం చాలా అరుదు.

ఎందుకంటే ఒకప్పుడు అయితే ఇవి అటవీ ప్రాంతంలో చాలా ఎన్నో ఉండేవి కానీ ప్రస్తుతం వీటి సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.ఎంతలా అంటే ఇంకొన్ని రోజుల్లో ఇలాంటి జీవులు ఒకప్పుడు ఉండేవి అని ఫోటోలో చూడడం తప్ప డైరెక్ట్ గా చూడలేనంతగా వీటి సంఖ్య తగ్గుతూ వస్తోంది, ఎందుకంటే ఈ అలుగు ఔషధ తయారీకి ఉపయోగపడుతుంది కాబట్టి.

మామూలుగా అలుగులు కనిపించటం చాలా అరుదు.ఇక దీని గురించి తెలియని వారికి, మొదటిసారి చూసిన వారికి అయితే దీని ఆకారం చూస్తే కాస్త భయం వేస్తుంది.

తల భాగం నుంచి తోక వరకు పూర్తిగా పోలుసులతో నిండి ఉంటుంది.ఇక ఈ పొలుసులు ఎంతో గట్టిగా ఉంటాయి.

Advertisement

ఎంతలా అంటే ఈ అలుగు ప్రాణ రక్షణ కోసం ముడుచుకున్న సమయంలో తుపాకీతో కాల్చిన ఒక బుల్లెట్ లోపలికి దిగదు దాని పొలుసులు అంత ధృడంగా ఉంటాయి.అయితే ఈ అలుగుకు ఉండే పొలుసులు దీనికి ఏదైనా అపాయం జరిగినప్పుడు ప్రాణ రక్షణకు ఉపయోగపడుతూ ఉంటుంది, ప్రస్తుతం మాత్రం అలుగుకు రక్షణ కలిగించే పొలుసులే దానికి శాపంగా మారుతున్నాయి.

అలుగుకు ఉండే పొలుసులు క్యాన్సర్ తయారీలో వినియోగిస్తారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో స్మగ్లర్లు అలుగులపై పై దృష్టి పెట్టారు.దీంతో ఎంతో అరుదుగా ఉండే ఈ అలుగులను వెంటాడి వేటాడి మరి ఏకంగా స్మగ్లింగ్కు పాల్పడుతున్నారట, ఇది ఇలాగే కొనసాగితే అలుగు అనేది కనిపించకుండా పోవడం ఖాయం అన్నది అందరికి తెలిసిన నిజం.

ఇటీవలే ప్రకాశం జిల్లాలోని బెస్తవారిపల్లెలో స్థానికులకు అలుగు కనిపించడంతో వారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి ఈ అలుగును అప్పగించారు.దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు