కాంగ్రెస్ పార్టీలో మండల కమిటీల పంచాయతీ కొనసాగుతోంది.ఈ క్రమంలో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు.
ఇందులో భాగంగా పాత మండల కమిటీలనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.దాంతో పాటు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాశ్ శ్రీనివాస రావుని తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డిలో సుభాశ్ రెడ్డి అనుకూల వర్గానికే చోటు ఇచ్చారని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.మొదట నుంచి పార్టీలో కష్టపడిన వారికి మండల పదవులు ఇవ్వలేదని మదన్ మోహన్ వర్గీయులు ఆందోళనకు దిగారు.
కామారెడ్డి డీసీసీని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.