ఒకప్పుడు నేషనల్ అవార్డు విన్నర్.. ఇప్పుడు ఇంత చెత్త సినిమా తీశాడు ఏంటి..

2002లో ప్రయోగాత్మక చిత్రంగా తెరకెక్కిన “షో” బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు గెలుచుకుంది.డైరెక్టర్ నీలకంఠ ( Neelakanta )ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు.

 Diretor Neelakanta Latest Movie, Diretor Neelakanta, Circle Movie, Neelakanta,-TeluguStop.com

ఒక చిన్న సినిమాగా వచ్చిన దీనికి అద్భుతమైన స్క్రీన్‌ప్లే అందించి నీలకంఠ జాతీయ అవార్డును అందుకున్నాడు.మంజుల ఘట్టమనేని( Manjula Ghattamaneni ) ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

నీలకంఠ ఈ సినిమా తర్వాత “మిస్సమ్మ” తెరకెక్కించాడు.భూమిక టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది.

ఈ సినిమా కథ కూడా చాలా బాగుంటుంది.ఇది నాలుగు నంది అవార్డులను కూడా గెలుచుకుంది.

Telugu Chammak Challo, Circle, Neelakanta, Maya, Missamma, Tollywood-Movie

షో, మిస్సమ్మ సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు నీలకంఠ.కానీ అలా వచ్చిన పేరు ఎంతో కాలం నిలవలేదు.ఈ టాలెంటెడ్ దర్శకుడు తీసిన సదా మీ సేవలో (2005), నందనవనం 120km, మిస్టర్ మేధావి సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి.2011 వచ్చిన విరోధి విమర్శకుల చేత ప్రశంసలు పొందింది కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది.తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి తీసిన చమ్మక్ చల్లో( Chammak Challo ) అట్టర్ ప్లాప్ అయ్యింది.

Telugu Chammak Challo, Circle, Neelakanta, Maya, Missamma, Tollywood-Movie

2014లో నీలకంఠ డైరెక్షన్‌లో వచ్చిన సైకలాజికల్ సూపర్‌నేచురల్ ఫిలిం “మాయ” పర్లేదు అనిపించింది.మళ్లీ దాదాపు పదేళ్ల తర్వాత “సర్కిల్” సినిమాతో నీలకంఠ తెలుగు ప్రేక్షకుల మందుకు వచ్చాడు.ఈ సినిమాకి కథ కూడా అతనే అందించాడు.2023, జులై 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిన్ మెహతా, రిచా పనాయ్, నైనా ప్రధాన పాత్రలు పోషించిన సర్కిల్ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

ఒక నేషనల్ అవార్డు విన్నర్ అయి ఉండి నీలకంఠ సర్కిల్ సినిమాని ఇలా డైరెక్ట్ చేశాడు ఏంటని చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు.కథ, కథనంలో కూడా బలం లేకపోగా, ఇంత చెత్త సినిమా ఎలా తీసారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా నీలకంఠ డౌన్ ఫాల్ అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube