సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలలో వెంకటేష్( Venkatesh ) ఒకరు.ఈయన ప్రస్తుతం శైలేష్ కొలన్ డైరెక్షన్ లో సైంధవ్ అనే సినిమా( Saindhav Movie ) చేస్తున్నాడు ఈ సినిమా మొదట చిన్న గా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం పాన్ ఇండియా స్టార్లు మొత్తం ఈ సినిమా లో నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.నవజాద్దీన్ సిద్ధికి( Nawazuddin Siddiqui ) లాంటి నటులు ఈ సినిమా లో చేయడం ఈ సినిమా కి చాలా వరకు కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి.ఎందుకంటే పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్ ఈ సినిమా ని ప్లాన్ చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా ని కూడా అంతే రిచ్ గా, గ్రాండ్ గా డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు…

ఇక ఈ సినిమా కి డైరెక్టర్ అయిన శైలేష్ కోలన్ ఇంతకు ముందు చేసిన హిట్, హిట్ 2 సినిమాలు రెండు కూడా మంచి విజయాన్ని అందుకోవడం తో సగటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి అనే చెప్పాలి.ఇక ఈ సినిమాతో ఒక రేంజ్ హిట్ అయితే వెంకటేష్ అందుకోబోతున్నాడు అనే విషయం తెలుస్తుంది.

ఇక వెంకటేష్ కి ఈ సినిమా ఒక మంచి బూస్టప్ ఇస్తుంది అని మరి కొందరు అభిప్రాయం పడుతున్నారు.ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్ అనుదీప్ డైరెక్షన్( Anudeep KV ) లో ఒక సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.ఇప్పటికే అనుదీప్ కూడా వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టాడు ఇక దానితో వెంకటెష్ కూడా చాలా బిజీ గా ఉంటున్నాడు.మిగితా హీరోల లాగ తాను సోలో సినిమాలు మాత్రమే చేసుకుంటూ ఉండకుండా వరుసగా మల్టి స్టారర్ చిత్రాల్లో కూడా నటిస్తున్నాడు…ఇక వెంకటేష్ సినిమా కోసం ఎదురుచూసే ఆడియన్స్ కూడా చాలా మంది ఉన్నారు…
.







