వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం చేసి పల్లకిలో ఊరేగించిన గ్రామస్తులు..

తమ గ్రామానికి రోడ్డు వేయించి తమ చిరకాల కోరిక తీర్చిన ఓ ఎమ్మెల్యేను గ్రామస్తులు పల్లకిలో ఊరేగించి ఘన సన్మానం చేస్తే ఇప్పుడు మరో గ్రామానికి చెందిన వారు అంతకు మించి అన్నట్టు ఆడంబరంగా సత్కరించారు.తనకు జరిగిన ఆ ఘన సన్మానంతో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే.

 Palabhisekam To Parvathipuram Ycp Mla Alajangi Jogarao Details, Palabhisekam ,pa-TeluguStop.com

ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయనకు జరిగిన ఆ ఘన సన్మానం ఏంటో తెలుసుకుందాం రండి.పార్వతీపురం మన్యం జిల్లా బలిజి పేట మండలం పి.చాకరాపల్లి గ్రామస్తుల చిరకాల వాంఛ నెరవేరింది.గత ఐదు దశాబ్ధాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు.

చిన్నపాటి అవసరానికి అయినా గ్రామం నుండి బయటకు రావాలంటే గ్రామస్తులు అష్టకష్టాలు పడేవారు.ఎన్నికలు వచ్చిన ప్రతిసారి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్ళడం గ్రామానికి రోడ్డు వేయిస్తామని హామీ ఇవ్వడం ఇక్కడ పరిపాటిగా వస్తుంది.

Telugu Manyam, Chakarapalli, Palabhisekam, Parvathipuram, Road, Ycp Mla, Ycpmla-

ఈ క్రమంలోనే జరిగిన 2019 ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఈ గ్రామానికి ప్రచారానికి వెళ్ళారు.అందులో భాగంగా పార్వతీపురం వైసీపీ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామానికి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు.ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు భారీ మెజారిటీ తో గెలిచారు.దీంతో ఇచ్చిన హామీల పై దృష్టి సారించారు.ఈ నేపథ్యంలోనే దశాబ్ధాలుగా పి.చాకరపల్లికి రోడ్డు లేకపోవడం పై ఇచ్చిన హామీ పై కసరత్తు ప్రారంభించారు.మండలంలోని అజ్జాడ నుండి సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర కావాల్సిన రోడ్డుకు ఎస్టిమేషన్ వేయించారు.రోడ్డు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో తారు రోడ్డు కు శ్రీకారం చుట్టారు.

సుమారు రెండు కోట్ల ప్రత్యేక నిధులు వెచ్చించి తారురోడ్డు నిర్మాణం పూర్తి చేశారు.రోడ్డు వేసే క్రమంలో స్థానికంగా ఎదురైన సమస్యలను అధిగమించి రోడ్డు పూర్తి చేసి హామీ నిలబెట్టుకున్నారు.

రోడ్డు నిర్మాణంతో సుమారు మూడు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ గ్రామానికి దశాబ్దాల కల నెరవేరింది.దీంతో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు ను సన్మానించే0దుకు నిర్ణయించారు గ్రామస్తులు.

తమ గ్రామానికి ఆహ్వానించి మేళతాళాలు, తప్పెట గుళ్ళు, సంప్రదాయ నృత్యాతో స్వాగతం పలికి గుర్రపు బగ్గీలో ఊరేగించారు.దారి పొడవునా పూల వర్షం కురిపించారు.అనంతరం గ్రామంలోని మహిళలు వందల లీటర్ల పాల బిందెలతో పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు.తనకు జరిగిన సన్మానం తో భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు ఎమ్మెల్యే అలజంగి జోగారావు.

గడప గడపకు వచ్చిన అనేక సందర్భంలో అనేక సమస్యలు తమ దృష్టికి వస్తున్నాయని, అన్ని సమస్యలు నెరవేరుస్తున్నామని అన్నారు జోగారావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube