నువ్వు దేవుడు సామి.. ఇతడు బైక్‌పై దేనితో రైడింగ్‌ చేస్తున్నాడో తెలిస్తే నోరెళ్లబెడతారు

ఎవరైనా టూ వీలర్‌పై స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో రైడ్‌కు వెళ్లారు.

కాని కొందరు మాత్రం తమ పెంపుడు కుక్కలు లేదా పిల్లులతో రైడ్‌కు వెళ్తూ ఉంటారు.

అతి కొద్ది మంది మాత్రం పక్షులను కూడా తమ బండిపై పెట్టుకుని రైడ్‌ చేస్తారు.ఇక బొమ్మలతో కూడా కొందరు రైడ్‌ చేస్తూ ఉంటారు.

కాని ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా ఒక ఆవు దూడను బైక్‌పై కూర్చోబెట్టుకుని రైడ్‌ చేయడం చూసి ఉండం.ఆవు దూడ అంటే ఏం చిన్నగా ఉండదు.

కనీసంగా 30 నుండి 50 కేజీలు ఉండటంతో పాటు, ఆవుదూడ బండిపై కుదురుగా కూర్చోదు.కుక్క పిల్లలు కూర్చున్నట్లుగా ఆవు దూడ కూర్చోదు కనుక అది సాధ్యం కాదని అంతా భావిస్తాం.

Advertisement

కాని పాకిస్థాన్‌లోని ఒక వ్యక్తి తన బండిపై ఆవు దూడను ఎక్కించుకుని చక్కర్లు కొట్టాడు.

పాకిస్థాన్‌లో ఉండే హైదరాబాద్‌లో ఒక వ్యక్తి తన బైక్‌పై ఒక ఆవు దూడను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తున్నాడు.ఆ దూడకు తెల్ల వస్త్రం కప్పడంతో పాటు, చాలా హుందాగా ఆ దూడ ముందుకు చూస్తూ బండిపై వెళ్తోంది.మామూలుగా ఇలాంటి జంతువులు బండిపై లేదా మరి దేనిపై వెళ్లినా కూడా అటు ఇటు కదులుతూ ఉంటాయి.

అలా కదులుతున్న సమయంలో బండి కింద పడే అవకాశం కూడా ఉంది.కాని ఈ దూడ మాత్రం ఏమాత్రం కదలకుండా అలాగే స్టడీగా వెళ్తోంది.ఆ దూడను ఎలా ఒక సంచిలోకి ఎక్కించాడు.

ఆ తర్వాత బండిపై అతడు ఎలా దాన్ని ఎక్కించాడనే విషయంపై అందరు జుట్టు పీక్కుంటున్నారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆ దూడ అతడి పెంపుడు దూడ అయ్యి ఉంటుందని, పుట్టినప్పటి నుండి దానికి అలా అలవాటు చేయడం వల్ల ఇప్పుడు ఏమాత్రం కదలకుండా అలాగే ఉంటుందని కొందరు అంటున్నారు.ఏది ఏమైనా ఆ ఆవు దూడతో అతడి రైడ్‌కు సంబంధించిన వీడియోలు మరియు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.అదేదో చిన్న ఆవు దూడ కూడా కాక పోవడంతో, పెద్ద ఆవు అవ్వడంతో నువ్వు దేవుడివి సామి అంటూ అతడికి సెల్యూట్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు