మనం అనుకుంటాం కానీ… పురాతన కట్టడాలే చాలా నాణ్యతతో ఉండేవి.ప్రస్తుత కాలంలో కట్టడాలు నాణ్యత లేకుండా కట్టి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.
వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు లంచాలు తీసుకొని అధికారులు అన్ని నాణ్యత లేని కట్టడాలు కట్టిస్తున్నారు.ఇలా వారు చేసిన తప్పులకు సామాన్య ప్రజలు బలవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో నాణ్యత లేదు.
దీంతో చిన్న వాన పడినా సరే నీళ్లు కారుతున్నాయి.ఇంకా ఇప్పుడు కాస్త జోరుగా వర్షాలు కురవడంతో విమానాశ్రయం పైకప్పు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి పడుతుంది.
ఈ పెచ్చులు కాస్త ప్రయాణికులపై పడితే గాయాలు తగిలే అవకాశం ఉంది.
ఇంకా ఈ వీడియోను అక్కడ ఉన్న ప్రయాణికుడు తీసి సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం విచారణ చేపట్టింది.అయితే పాకిస్థాన్ లో ఈ ఘటన ఇప్పుడు చోటుచేసుకోగా గత సంవత్సరం భారత్ లోని హైదరాబాద్ లోను మెట్రో స్టేషన్ పెచ్చు ఊడి ఓ యువతిపై పడడంతో ఆ యువతీ అక్కడికక్కడే మరణించింది.