ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిలు.. ఎంతమంది ఉన్నారంటే?

మనుషులను మనుషులు పోలి ఉండటం సహజం.అలా ఏడు మంది ఉంటారని ఒకరు చెబితేనే తెలిసేది.

కానీ చూసేవారికు ఎవరు నమ్మకం పట్టరు.ఎందుకంటే ఒక అమ్మాయిని పోలి మరో అమ్మాయి లేదా ఒక అబ్బాయిని పోలి మరో అబ్బాయి ఉండటం సహజమే ఎందుకంటే అది ఎక్కువగా కవలులో చూస్తాము.

మరీ అలా కాకుంటే ఎక్కడో ఓ చోట కాస్త పోలికలతో ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాను.కానీ ఒకే పోలికతో ఉన్న ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ప్రపంచ సుందరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఆమెకు ఉన్న అభిమానులు మాత్రం లెక్కలేనంత ఉన్నారని చెప్పవచ్చు.

Advertisement

ఈమధ్య సోషల్ మీడియాలో హీరోయిన్స్ ను పోలి ఉన్న అమ్మాయిలు, హీరోల ను పోలి ఉన్న అబ్బాయిలు ఎక్కువగా కనిపిస్తున్నారు.ఈమధ్య అచ్చం ఐశ్వర్య లాగా ఉన్న అమ్మాయి నెట్టింట్లో వైరల్ గా మారింది.

పాకిస్తాన్ కి చెందిన బ్యూటీ పేరు ఆమ్నా ఇమ్రాన్.ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది.

ఆమె ఈ మధ్య తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన ఫోటోలను షేర్ చేయగా నెటిజనులు ఆశ్చర్యానికి గురయ్యారు.ఏంటి ఐశ్వర్యరాయా.అంటూ షాక్ అయ్యారు.

కానీ తన పేరు చూశాక నిజంగానే ఆశ్చర్య పడ్డారు.అచ్చం ఐశ్వర్యరాయ్ లాగా ఉన్న కళ్ళు, ముక్కు, పెదవులు మొత్తం జిరాక్స్ కాపీ లా కనిపిస్తుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

ఇక నెటిజనులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.దర్శకులకు ఐశ్వర్య రాయ్ ను మరో పాత్రలో తీయాలంటే ఈ అమ్మాయి ను తీసుకోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఇక మరికొందరు ఆనందభాష్పాలు తెలుపుతున్నారు.ఇదివరకే టాలీవుడ్ లో స్నేహ ఉల్లాల్ ఐశ్వర్య లాగానే ఉంటుందని సినిమాల్లో అవకాశం ఇవ్వగా.

ఈ అమ్మాయిని కూడా సినిమాల్లో తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా ఇటీవల సోషల్ మీడియాలో టిక్ టాక్ చేసిన ఓ అమ్మాయి అమ్మజ్ అమృత కూడా అచ్చం ఐశ్వర్య లాగానే పోలి ఉండటంతో ఆమె కూడా వైరల్ గా మారింది.

ఇక ఇప్పటికీ నలుగురు ఐశ్వర్య రాయ్ లు ఉండగా.మరో ముగ్గురు ఎక్కడ ఉన్నారో అని కామెంట్లను చేస్తున్నారు.

తాజా వార్తలు