ఇండియా కాళ్ళు పట్టుకుంటున్న పాకిస్తాన్‌?

పాక్ ఆర్థిక సంక్షోభం గురించి ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు.ప్రతిరోజూ వార్తల్లో చూస్తూ వున్నాం.

పాక్( Pakistan ) ఎంత దయనీయమైన స్థితిని ఎదుర్కుంటోందంటే ఐఎంఎఫ్‌ లోన్లు కూడా రావడం లేదు.విదేశీ మారక ద్రవ్య నిల్వలు దారుణంగా తరిగిపోతున్నాయి.

వ్యాపార వాణిజ్య సంబంధాలు గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.అవి ఆల్రెడీ దెబ్బతిన్నాయి.

నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో సగటు సామాన్యుడు ఏమిటి, ఏ తరగతివారూ అక్కడ బతికే పరిస్థితులు కనబడటం లేదు.

Advertisement

పాక్ పరిస్థితి గురించి ఈ ఒక్క విషయం చెబితే మీకు అర్ధం అయిపోతుంది.అక్కడ స్థితిగతుల గురించి.తనకు ఎంతో మిత్రదేశం అని పాక్ చెప్పుకు తిరుగుతున్నా చైనా( China ) కూడా వారికి అప్పులు ఇవ్వడం లేదంటే మీరు నమ్ముతారా? అవును, పాక్ లో పూర్తిగా అస్థిరత నెలకొంది.ఈ మధ్య పాకిస్థాన్ లో పార్లమెంట్ సమావేశాలు జరగగా ఎప్పుడూ పాక్ లో భారత్ ( India ) గురించి ద్వేషంగా మాట్లాడే నేతలు ఆర్థిక పరిస్థితి కుదేలైన తర్వాత ఇప్పుడు కాళ్ల బేరానికి వస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది.

తాజాగా పాక్ పార్లమెంట్ లో( Pakistan Parliament ) జరిగిన సమావేశాల్లో అక్కడి నేతలు భారత్ తో స్నేహం కావాలని అడిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.పాక్ ప్రధానిగా షాబాద్ షరీఫ్ కూడా అక్కడ ఉన్నారు.అక్కడ జరిగిన సమావేశంలో షరీఫ్ కూడా పాల్గొన్నారు.

పుల్వామా, పఠాన్ కోఠ్ లాంటి దాడుల తర్వాత ఇండియా పాక్ లు తమ రాయబారులను ఆయా దేశాల్లో నిషేదించిన సంగతి విదితమే.ఇలా నిషేధించిన కారణంగా పాక్ తో భారత్ కు ఎలాంటి సంబంధాలు లేవు.

కాగా ఇప్పుడు పాక్ తమ రాయబారిని భారత్ లో నియమించేందుకు ఆసక్తి కనబరుస్తోంది.కానీ పాకిస్థాన్ ను అసలు నమ్మకూడదని, పాక్ ను నమ్మడం వల్ల కలిగే ఇబ్బందులు అన్ని ఇన్నీ ఉండవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని
Advertisement

తాజా వార్తలు