పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు షాక్ ఇచ్చిన ఆసియా క్రికెట్ కౌన్సిల్..!

ఈ సంవత్సరం ఆసియా కప్( Asia Cup ) నిర్వహణకు పాకిస్తాన్ అథిత్యం ఇస్తున్న క్రమంలో వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ( ICC), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) పలుమార్లు పాకిస్తాన్ బోర్డుతో చర్చలు నిర్వహించిన సంగతి కూడా తెలిసింది.

 Pakistan Participation In Asia Cup Doubtful Details, Pakistan ,asia Cup ,asia Cu-TeluguStop.com

ఇక ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.దీంతో ఆసియా కప్ 2023 పాకిస్తాన్ నుండి తరలి వెళ్లే అవకాశం ఉంది.

ఇక ఈ టోర్నీలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆడోచ్చు.అడకపోవచ్చు.

Telugu Asiacricket, Asia Cup, Bcci, Cricket, India Pakistan, Pakistan, Pakistanc

ఎందుకంటే ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించాలని ఏసీసీ అనుకుంటున్నట్లు సమాచారం.ఒకవేళ ఇలా జరిగితే పాకిస్తాన్ టోర్నీలో పాల్గొనాలంటే శ్రీలంకకు రావాల్సిందే.ఒకవేళ శ్రీలంకకు రాకపోతే టోర్నీ నుంచి తప్పుకున్నట్టే.ఆసియా కప్ పాకిస్తాన్లో నిర్వహిస్తే.పాకిస్తాన్ కు వెళ్ళేది లేదని బీసీసీఐ ( BCCI ) స్పష్టంగా తెలిపింది.దీనికి గల కారణాలు అందరికీ తెలిసిందే.

ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ టోర్నీలో పాల్గొనాలంటే పాకిస్తాన్లో కాకుండా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని ఏసీసీ కు తెలిపింది.

Telugu Asiacricket, Asia Cup, Bcci, Cricket, India Pakistan, Pakistan, Pakistanc

ఈ విషయంలో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా భారత్ ఆసియా కప్ టోర్నీ నుండి తప్పుకుంటుందని నిర్ణయాన్ని ప్రకటించింది.అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్లో ఉండే సభ్య దేశాలు పాకిస్తాన్లో కొన్ని మ్యాచ్లు, తటస్థ వేదికలపై కొన్ని మ్యాచ్లు జరపడాన్ని తిరస్కరించినట్లు తెలుస్తుంది.అదే ఈ టోర్నీ అన్ని మ్యాచులు శ్రీలంకలో నిర్వహిస్తే బాగుంటుందని సభ్య దేశాలు కూడా ఈ విషయంలో అనుకూలంగా ఉన్నాయి.

అయితే ప్రస్తుతం ఆసియా కౌన్సిల్లో ఉండే సభ్య దేశాలు తమ నిర్ణయాలను కౌన్సిల్ కు తెలిపినట్లు సమాచారం.ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

మొత్తానికి పాకిస్తాన్ నుండి ఆసియా కప్ టోర్నీ మరో దేశానికి వెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube