సముద్రాలలో కనుమరుగవుతున్న ఆక్సిజన్... మరో వందేళ్ళలో

వాతావరణంలో అనూహ్య మారిన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.గత ముప్పై ఏళ్లలో చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఊహించని ఎన్నో మార్పులు వచ్చాయి.

ఈ మార్పులతో పాటు ప్రపంచంలో కాలుష్య ప్రభావం కూడా ఎక్కువైపోయింది.ఇప్పటికే ప్రపంచ దేశాలలో కాలుష్యం విపరీతంగా భయపెడుతుంది.

మరోవైపు జీవరాశి మనుగడకి కూడా ఈ కాలుష్యం ప్రమాదకరంగా మారింది.ఇక భూమిపై ఉన్న ఫ్యాక్టరీలు అన్ని సముద్రప్రాంతానికి దగ్గరగా కట్టి అందులో కాలుష్య వర్దాలని నేరుగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

దీంతో పాటు ప్లాస్టిక్ వంటి వ్యర్ధాలని కూడా తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నారు.మరో వైపు పెరిగిపోతున్న భూతాపం కారణంగా సముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోతోంది.ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది సముద్రాల్లోని 700 ప్రాంతాల్లో ఆక్సిజన్ అవసరమైన స్థాయికంటే తగ్గిపోయిందని ఆ నివేదికలో వెల్లడైంది.1960ల్లో సముద్రంలో ఆక్సిజన్ తక్కువగా ఉండే ప్రాంతాలు కేవలం 45 మాత్రమే ఉండగా ఇప్పుడు అవి ఏకంగా 700కి పెరిగిపోయాయని స్పష్టం చేసింది.దీనికి పెరుగుతున్న భూతాపం కారణమని తెలియజేసింది.

Advertisement

ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి సముద్రాలు 3 నుంచి 4 శాతం వరకే ప్రాణవాయువు ఉంటుందని ఐయూసీఎన్ ఆందోళన వ్యక్తం చేసింది.ఈ ప్రభావం సముద్రంలో ఉన్న జలచరాలపై పడుతుందని తెలిపింది.

దీనికి పర్యావరణంలో తలెత్తుతున్న మార్పులే కారణం అని తెలుస్తుంది.ఇప్పటికైనా సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తు సముద్ర జీవరాశుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని తెలియజేసింది.

Advertisement

తాజా వార్తలు