టాలీవుడ్ మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల గురించి అందరికి తెలిసిందే.ఇక ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ గుర్తింపు రాలేకపోయేసరికి అవకాశాలు కూడా అంతగా రాలేకపోయాయి.
ఇక ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత మాత్రం మంచి మంచి ప్రాజెక్టులను సొంతం చేసుకుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా బిజీగా ఉంటుంది.
కొణిదెల నిహారిక గత ఏడాది చైతన్య జొన్నలగడ్డ ను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లి తర్వాత ఈ అమ్మడు బాగా బిజీ గా మారింది.
అంతేకాకుండా ఓ వెబ్ సిరిస్ లో కూడా చేయనుంది.ఇదిలా ఉంటే మరో క్రేజీ సినిమా ఆఫర్ రాగా అందులో నటిస్తుంది.
ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
ఇంతకీ ఆయన ఎవరో కాదు ప్రముఖ క్రేజీ నటుడు విజయ్ సేతుపతి.
ఈయన, నిహారిక కలిసి నటిస్తున్న సినిమా ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’.ఈ సినిమా ఆరుముగ కుమార్ దర్శకత్వంలో తమిళంలో ‘ఆరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’ అనే టైటిల్ తో తెరకెక్కగా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమాను తెలుగులో రావూరి అల్లి కేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్ పై డాక్టర్ రావూరి వెంకట స్వామి ఈనెల 19న విడుదల చేయనున్నారు.

ఈ విధంగా వెంకటస్వామి మాట్లాడుతూ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న సినిమా ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’.ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన హైలెట్ గా ఉంటుందని, విలక్షణ నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాడని తెలిపాడు.ఇక ఇందులో నిహారిక కొణిదెల ఇప్పటి వరకు చేయని పాత్రలో నటించిందని తెలిపాడు.
ఇక ఈ సినిమా తమిళంలో బాగా ఆకట్టుకోగా తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని తెలిపారు.