కరోనాతో చనిపోయిన అభ్యర్థి అమెరికా ఎన్నికల్లో ఘన విజయం!

అగ్రరాజ్యం అమెరికాలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

 North Dakota State Legislative Candidate Who Died Of Covid 19 Wins Election Cor-TeluguStop.com

అయితే ఈ ఎన్నికలలో నార్త్ డకోటా కు చెందిన 55 సంవత్సరాల రిపబ్లికన్ నేత డేవిడ్ అందల్ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించాడు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంతో కృశించిన డేవిడ్ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయానికి అతను మరణించిన ఘటన చోటు చేసుకుంది.

డేవిడ్ గత నెల అక్టోబర్ 5 వ తేదీన కరోనా బారిన పడి మృతి చెందాడు.

కరోనా సోకి ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స తీసుకున్న డేవిడ్, వ్యాధి తీవ్రతరం కావడంతో అక్టోబర్ 5న మృతి చెందాడు.

అయితే ఇతను మృతిచెందిన నెలకి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి.ఈ ఫలితాలలో డేవిడ్ ఘన విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు.డేవిడ్ నార్త్ డకోటాలోని బిస్ మార్క్ ప్రాంతంలో రిపబ్లికన్ పార్టీ తరపున డేవిడ్ అందల్,డేవ్ నెహ‌రింగ్‌లు ఎన్నికల బరిలో ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా డేవిడ్, తాను గెలిస్తే రైతులకు, బొగ్గు పరిశ్రమకు ఎంతో సేవ చేయాలని భావించినట్లు డేవిడ్ తల్లి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

అయితే ఈ జిల్లాలోని ప్రజలు ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకుంటారు.అందులో డేవిడ్ కు 35 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలియజేశారు.

అయితే ఇంతటి శుభవార్తని వినడానికి ప్రస్తుతం డేవిడ్ లేకపోవడంతో పార్టీ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ప్రస్తుతం నార్త్ డకోటా లో కరోనా తీవ్రత రోజు రోజుకి ఉదృతం అవుతుందని అక్కడి అధికారులు తెలియజేశారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, వారి కార్యకలాపాలను కొనసాగించాలని అధికారులు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube