పెళ్లిలో అవయవదానం ఓ కొత్త జంట వినూత్న ప్రయత్నం అద్భుతంగా స్పందించిన బంధుమిత్రులు 68 మంది నుంచి అంగీకార పత్రాలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మల్టీ పర్పస్ కమిటీ హాల్ వేదిక అయింది.
ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామానికి చెందిన సతీష్ కుమార్ ,కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సజీవరాణి ల వివాహం జరిగింది .ఈ వివాహ ఆహ్వాన పత్రికల్లోనే అవయవ దానం చేయండి ప్రాణదాతలు కండి అంటూ అభ్యర్థించారు .దీనికి బంధుమిత్రుల నుంచి విశేష స్పందన లభించింది .వివాహ వేదికపైనే నూతన వధూవరులతో పాటు మొత్తం 68 మంది అవయవ దాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి విశాఖపట్నం నుంచి వచ్చిన సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సమస్త
.